మెదక్ లో ఘోరం : కత్తితో కాలేజీ అమ్మాయిని దారుణంగా..
సదాశివపేట : తన ప్రేమను తిరస్కరించిందన్న కారణంతో కత్తితో యువతిపై దాడికి తెగబడ్డాడు ఓ ప్రేమోన్మాది. మెదక్ జిల్లా సదాశివపేటలో చోటు చేసుకున్న ఈ ఘటనలో.. ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడింది బాధిత యువతి.
వివరాల్లోకి వెళ్తే.. సదాశివపేటలో స్థానికంగా ఉన్న పద్మనాభ డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతోన్న 19 ఏళ్ల ఓ విద్యార్థినిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు సతీష్ అనే ప్రేమోన్మాది. అయితే విద్యార్థిని మాత్రం ఆ వ్యక్తి ప్రేమను తిరస్కరిస్తూ వస్తోంది. దీంతో ఆమెపై కక్ష గట్టిన అతడు సోమవారం నాడు కత్తితో ఆమెపై దాడి చేశాడు.

ఘటన తర్వాత అతన్ని పట్టుకోవడానికి స్థానికులు ప్రయత్నించగా,.. అక్కడినుంచి పరారయిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలిని పరిశీలించి నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications