పోలీసు స్టేషన్‌పై దాడి: పోలీసుల అదుపులో 40 మంది
హైదరాబాద్: సికింద్రాబాదులోని వెస్ట్ మారేడుపల్లి పోలీసు స్టేషన్‌పై దాడి కేసులో హైదరాబాద్ నగర నేర పరిశోధక విభాగం (సిసిఎస్) పోలీసులు 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. బోనాల పండుగ సందర్భంగా కరీంనగర్‌కు చెందిన ఓ హోంగార్డు విధులు నిర్వహించేందుకు వెస్ట్ మారేడుపల్లిలోని గాంధీనగర్ వచ్చాడు.
తనపై బన్నప్ప అనే ఆటో డ్రైవర్ దాడి చేశాడని ఆ హోంగార్డు వెస్ట్ మారేడుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో మారేడుపల్లి పోలీసులు బన్నప్పను అదుపులోకి తీసుకున్నా. ఆ విషయం తెలుసుకున్న అతని బంధువులు వచ్చి అతన్ని విడిపించుకుని ఇంటికి తీసుకుని వెళ్లారు.

ఆ తర్వాత కాసేపటికి బన్నప్ప స్పృహ కోల్పోయాడు. దాంతో కుటుంబ సభ్యులు అతడ్ని వెంటనే ఆర్ఎంపి వైద్యుడి వద్దకు తీసుకుని వెళ్లారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించే క్రమంలో అతను మరణించాడు. దాంతో మృతుడి బంధువులు మృతదేహంతో స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. అంతటితో ఆగకుండా ఆగ్రహించిన స్థానికులు వెస్ట్ మారేడుపల్లి పోలీసు స్టేషన్‌పై దాడికి దిగారు.
స్టేషన్‌లోని కానిస్టేబుళ్లను, ఎస్సైని చితకబాదారు. పోలీసు స్టేషన్ ఆవరణలో ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి నిప్పంటించారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా ప్రతిస్పందించారు. దాంతో పోలీసులు స్టేషన్‌పై దాడి చేసినవారిని అరెస్టు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా 40 మందిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications