ఏది అడిగినా మోడీ "ఛాయ్" అనే సమాధానమే చెబుతారు: అక్బరుద్దీన్
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మజ్లిస్ నేతలు బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తాజాగా ప్రధాని ఛాయ్ కామెంట్స్ పై చాంద్రాయణ గుట్ట తాజామాజీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ స్పందించారు. ప్రధాని మోడీ ఛాయ్ కహానీ వినీ వినీ వేశారిపోయామని అన్నారు.
twitter link:#WATCH Akbaruddin Owaisi, AIMIM in Hyderabad: Baat karein ki ‘chai chai chai, chai. Har waqt vahi, demonetisation. Ye chai, vo chai, kadak chai, naram chai. Ye Wazir-e-Azam hain ya kya hain? Arey chaiwala tha, ab Wazir-e-Azam hai. Wazir-e-Azam jaisa ban jao. (02.12.2018) pic.twitter.com/t4xA1S103j
— ANI (@ANI) December 3, 2018
బీజేపీ మజ్లిస్ నేతలు ఏమి చేశారని ప్రశ్నిస్తున్నారని ముందు ముస్లింలకు వారు ఏమి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రధాని ప్రసంగంలో ఏమైనా చెబుతారా అని ఆసక్తిగా వింటే అందులో ఛాయ్, ఛాయ్ ఛాయ్ తప్ప ఏమీ కనిపించదు వినిపించదు అని ఎద్దేవా చేశారు. పెద్ద నోట్ల రద్దు గురించి అడిగితే... నరేంద్ర మోడీ, టీ ఎన్ని రకాలుగా ఉంటుందో చెబుతారని విమర్శించారు. చిక్కటి టీ, కెటెల్ టీ, నీళ్ల టీ, టీ స్టవ్ ఇలాంటివి చెబుతారని ఆయన ఒక దేశానికి ప్రధానా లేక ఇంకేమైనానా అంటూ విమర్శంచారు.

ఒకప్పుడు మోడీ టీ అమ్ముకునేవారే... కాని ఇప్పుడు దేశానికి ప్రధాని అని ఆ విషయం గుర్తెరిగి ప్రవర్తించాలన్నారు అక్బరుద్దీన్. బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్‌ను విడిచి వెళ్లి పోవాలని యోగీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు అక్బరుద్దీన్ ఓవైసీ. తమ తర్వాత మరో వెయ్యి తరాలు హైదరాబాదులోనే ఉంటాయని ఘాటుగా స్పందించారు. ఇదిలా ఉంటే డిసెంబర్ 7న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుండగా... ఫలితాలు డిసెంబర్ 11న వెలువడుతాయి.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications