Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మైనర్ బాలికి కేసులో దోషులను రక్షించే ప్రయత్నం.!కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదు.!ఢిల్లీ నుండి రేవంత్ ఫైర్.!

ఢిల్లీ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ అత్యాచారం ఘటనపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వాస్తవాలు బహిర్గతం చేస్తున్నట్టు నటిస్తూ అసలు నిందితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీవి ఆనంద్ మాటల్లో స్పష్టమైందన్నారు ఎంపీ, టీపీసీసీ అధ్యక్షులు, రేవంత్ రెడ్డి. నిందితులతో పాటు బాధితురాలు ప్రయాణించిన కారు కేసులో కీలకమైన ఆధారమని, మైనర్లు వాహనం నడుపునపుడు యజమానులకు పోలీసులు సమాచారం ఇవ్వాలని, యజమానులకు నోటీసులు ఇచ్చి విచారించాలన్నారు రేవంత్ రెడ్డి. వాహన యజమానులను ఎందుకు విచారించలేదు, ఆ వివరాలన్నింటినీ సి వి ఆనంద్ ఎందుకు వెల్లడించలేదో చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేసారు.

 రేప్ కేసులో ఎంఐఎం నేతల పిల్లలు.. సమగ్ర విచారణ జరపాలన్న రేవంత్ రెడ్డి

రేప్ కేసులో ఎంఐఎం నేతల పిల్లలు.. సమగ్ర విచారణ జరపాలన్న రేవంత్ రెడ్డి

సీఎం చంద్రశేఖర్ రావు పదవి ఇచ్చిన చైర్మన్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కుటుంబ సభ్యుల పైన ఆరోపణలు వస్తున్నాయన్నారు రేవంత్ రెడ్డి. ఘటన జరిగిన 28వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ఇన్నోవా వాహనాన్ని పోలీసులు ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించారు. ఆధారాలను మాయం చేసి చెరిపేసి అసలు నిందితులు రక్షించేందుకు ఈ ప్రయత్నం చేసినట్లు కనపడుతుందన్నారు రేవంత్. హైదరాబాద్ నగరాన్ని పబ్స్, డ్రగ్స్ అడ్డాగా మార్చారని, చంద్రశేఖర్ రావు, మంత్రి కేటీఆర్ పై ధ్వజమెత్తారు. తండ్రీకొడుకులు విశ్వ నగరంగా ఉండాల్సిన హైదరాబాదును విష నగరంగా మార్చారన్నారు.

 డ్రగ్స్ నియంత్రణపై పోరాటం చేసా.. ప్రభుత్వం పట్టించుకోలేదన్న రేవంత్

డ్రగ్స్ నియంత్రణపై పోరాటం చేసా.. ప్రభుత్వం పట్టించుకోలేదన్న రేవంత్


హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ పుబ్స్ పై తాను ఎంతో కాలం నుంచి పోరాడుతున్నానని, చంద్రశేఖర్ రావు సీఎం ఐన నాటి నుండి హైదరాబాదులో పబ్ సంఖ్య విచ్చలవిడిగా పెరిగిందన్నారు. మైనర్ లను అనుమతి ఇస్తున్నందుకు యజమానులపై కేసులు పెట్టి ఎందుకు అరెస్టు చేయడం లేదో చెప్పాలని, మైనర్లను అనుమతిస్తున్నందుకు లైసెన్స్ లను ఎందుకు రద్దు చేయడం లేదని రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసారు. మైనర్ బాలికలపై అత్యాచారాలు జరుగుతుంటే చంద్రశేఖర్ రావు ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు. పాశవిక ఘటనలు, హత్యలు భూ ఆక్రమణలు అత్యాచారాల్లో టిఆర్ఎస్, ఎంఐఎం నేతల ప్రమేయమే ఎక్కువగా ఉంటుదన్నారు రేవంత్ రెడ్డి.

 హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించం.. బౌతిక దాడులకు పాల్పడతామన్న పీసిసి ఛీఫ్

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించం.. బౌతిక దాడులకు పాల్పడతామన్న పీసిసి ఛీఫ్


హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తింటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని రేవంత్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అవసరమైతే యూత్ కాంగ్రెస్ విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించేవారిపై భౌతిక దాడులకు సైతం వెనుకాడబోమని తేల్చి చెప్పారు రేవంత్ రెడ్డి. ఇన్నోవా, బెంజ్ కార్ యజమానులపై కేసులు పెట్టి వెంటనే అరెస్టు చేయాలని నగర కమీషనర్ సి వి ఆనంద్ ను రేవంత్ రెడ్డి డిమాండ్ చేసారు. ఎంఐఎం,టీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నట్టే రేపులు మర్దర్లలో కూడా టీఆరెస్, ఎంఐఎం ల భాగస్వామ్యం అవుతున్నాయని ఎద్దేవా చేసారు రేవంత్ రెడ్డి.

 అసాంఘిక కలాపాలకు హైదరాబాద్ అడ్డా..పబ్ లపై కాంగ్రెస్ పార్టీ దాడులకు దిగుతుందన్న రేవంత్

అసాంఘిక కలాపాలకు హైదరాబాద్ అడ్డా..పబ్ లపై కాంగ్రెస్ పార్టీ దాడులకు దిగుతుందన్న రేవంత్


అంతే కాకుండా పబ్బులు, డ్రగ్స్ పై ముఖ్యమంత్రి కి సిపి నివేదిక ఇచ్చారా.?అని రేవంత్ సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్ ను రక్షించుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీదన్నారు. పబ్ లపై దాడి చెయ్యాలని ఎన్ఎస్యూఐకి పిలుపునిస్తున్నానని, ఎయిర్పోర్టు వద్ద నిర్వహిస్తున్న పబ్ లు బ్రోతల్ హౌస్ లను మించిపోతున్నాయన్నారు రేవంత్ రెడ్డి. ఇందుకు ప్రభుత్వ ఉన్నతాదికారి జయేష్ రంజన్ బాధ్యత వహించాలని, వెంటనే ఎయిర్పోర్ట్ వద్ద పబ్ ల అనుమతులు రద్దు చెయ్యాలని రేవంత్ డిమాండ్ చేసారు. అసాంఘిక కలాపాలకు హైదరాబాద్ అడ్డాగా మారుతుందని, ప్రభుత్వం పట్టించుకోక పోతే పబ్ లపై కాంగ్రెస్ పార్టీ దాడులకు దిగుతుందని రేవంత్ హెచ్చరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+