మూగ బాలికపై ఆటో డ్రైవర్ రేప్: కూతురుకు ఉరేసి తల్లి ఆత్మహత్య
రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ చింతల్‌మెట్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మూగ బాలికపై ఆటో డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. బస్తీకి చెందిన జాఫర్‌బీ, మహ్మద్‌ల కూతురు(15) పుట్టు మూగ. రోడ్లపై బిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.
ఈ అమ్మాయిని జూన్ 29 రాత్రి ఆటో డ్రైవర్ జాఫర్(28) తన ఆటోలో ఎక్కించుకొని.. రాజేంద్రనగర్ శివారులోని మానస హిల్స్ వెనక భాగంలో ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడే ఆ అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడి వదిలేసి వచ్చాడు.
రాత్రి ఇంటికి చేరిన బాధితురాలు జరిగిన ఘోరాన్ని తల్లి దండ్రులకు చెప్పుకోలేక నరక యాతన అనుభవించింది. చివరకు కూతురు వేదనను అర్థం చేసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

కూతురికి ఉరేసి ఆత్మహత్య చేసుకున్న తల్లి
ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేట మండలం బచ్చువారిగూడెంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తన మూడేళ్ల కూతురికి ఉరేసి అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంది ఓ తల్లి. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని స్థానికులు తెలిపారు.
అజంతా ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ
దోపిడీ దొంగలు అజంతా ఎక్స్‌ప్రెస్ రైలులో దోపిడీకి పాల్పడ్డారు. ఏ-2 బోగీలోని ప్రయాణికుల నుంచి నగలు, నగదును అపహరించుకుపోయారు. ప్రయాణికులు షిర్డీ నుంచి సికింద్రాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. చోరీపై బాధితులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications