స్నేహితుడి ఇంట్లో బంధించి యువతిపై ఆటో డ్రైవర్ రేప్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: యువతిని లోబరుచుకోవడానికి ఓ ఆటో డ్రైవర్ పెద్ద పథకమే వేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై అత్యాచారం చేశాడు. హైదరాబాద్ నగరానికి చెందిన యువతి(23)తో ఆటో డ్రైవర్‌ ముజాహిద్‌ (26)కు మూడు నెలల క్రితం పరిచయం ఏర్పడింది.

తనకు నాలుగు ఆటోలున్నాయని, ఫైనాన్స్‌ బిజినెస్‌ కూడా ఉందని, పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మిస్తూ వచ్చాడదు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం ముదిరింది. ఆమెను తరచూ హోటళ్లు, పార్కులకు తీసుకెళ్లేవాడు. ఆమెను లొంగదీసుకోవాలనే ఆలోచనతో ఈనెల 21వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో ఆధార్‌కార్డు తీసుకొని ఫంక్షన్‌ హాల్‌ వద్దకు రమ్మని ఫోన్‌ చేశాడు.

Auto driver rapes 23 year old girl in old city of Hyderabad

ఆ యువతి అక్కడికెళ్లి చూడగా అతడు ముగ్గురు స్నేహితులతో ఆటోలో వేచి ఉన్నాడు. ఆమెను ఆటోలో ఎక్కించుకొని హోటల్‌కెళ్లి భోజనం చేశారు. కూల్‌ డ్రింక్‌ తాగిన తర్వాత స్నేహితుడు రషీద్‌ ఇంటికి తీసుకెళ్లి నిర్బంధించాడు. రాత్రి 11 గంటల సమయంలో మద్యం తాగివచ్చిన ముజాహిద్‌ ఆమెపై అత్యాచారం చేశాడు.

విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఆటోలో తీసుకెళ్లి ఇంటి సమీపంలో విడిచిపెట్టి వెళ్లిపోయాడు. జరిగిన విషయం కుటుంబ సభ్యులకు చెప్పి కాలాపత్తర్‌ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసింది. ముజాహిద్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An auto driver raped 23 year old girl in old city of Hyderabad. a case has been booked against him.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X