కెసిఆర్ చేసిన యాగాలు ఇవే..: అలీ మినహా కేబినెట్ అంతా ఎర్రవెల్లిలో

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పేరు చెబితే తెలంగాణ ఉద్యమ నాయకుడిగా గుర్తుకు వస్తుంటారు. అయితే, ఆయనలో ఆధ్యాత్మికత కూడా ఎక్కువే. ప్రస్తుతం ఆయన ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆయుత చండీయాగం నిర్వహిస్తున్నారు.

ఆయన గతంలోను ఎన్నో యాగాలు నిర్వహించారు. ఇటీవల విజయవాడకు వెళ్లి, ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం కెసిఆర్ ఆహ్వాన పత్రికను ఇచ్చారు. ఆ సమయంలో చంద్రబాబు.. మీరు టిడిపిలో ఉన్నప్పుడు యాగాలు చేయలేదు కదా అని ప్రశ్నించగా... చేశానని కెసిఆర్ బదులిచ్చారు.

కెసిఆర్‌కు యాగాలు కొత్త కాదు. ఆయన గతంలోను చాలాసార్లు వివిధ యాగాలు చేశారు. సుదర్శన యాగం, చండీయాగం, శతచడీయాగం నిర్వహించారు. దాదాపు ఇరవై ఏళ్లుగా ఆయన వివిద సందర్భాల్లో యాగాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం కోసం ఆన మూడేళ్ల క్రితం శతచండీయాగం నిర్వహించారు. మరుసటి ఏడాది తెలంగాణ వచ్చింది.

Ayutha Chandi Maha Yagam: KCR Yagnam lists

కెసిఆర్ నిర్వహించిన యాగాలు ఇవే...

- 1996లో సహస్ర లక్ష్మీ సూక్త పారాయణాలు. సహస్ర లక్ష్మీ సూక్త పారాయణ సహిత అభిషేకం.
- 1997లో బాపిశాస్త్రి ఆధ్వర్యంలో చండీహననం.
- 2005లో కేంద్రమంత్రిగా ఢిల్లీలోని తన నివాసంలో నవగ్రహ మఠం, చండీయాగం.
- 2006లో సహస్ర చండీయాగం.
- 2007లో పాలకుర్తి నరసింహ రామశర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో చండీయాగం, సుదర్శన యాగం.
- 2008లో సిద్దిపేట కోటిలింగాల ఆలయంలో గాయత్రీ యాగం.
- 2009లో తెలంగాణ భవన్లో 27 రోజుల పాటు నక్షత్ర మండల యాగం.
- 2010లో తెలంగాణ భవన్లో చండీయాగం.
- 2011లో బండ్లగూడలోని ఎంపీ జితేందర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో శతచండీయాగం.
- 2015 నవంబర్ 27న నవ చండీయాగం.
- 2015 డిసెంబర్ 23 నుంచి 27వరకు ఆయుత శతచండీయాగం.

కేబినెట్ అంతా ఎర్రవల్లిలో..

ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మినహా మిగిలిన మంత్రులు అందరూ ఆయుత చండీయాగానికి తరలి వచ్చారు. మంత్రులు కెటిఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, నాయిని నర్సింహా రెడ్డి, కడియం శ్రీహరి, ఈటెల రాజేందర్, హరీష్ రావు, డి శ్రీనివాస్, తుమ్మల నాగేశ్వర రావు తదితరులు కుటుంబ సమేతంగా వచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+