అజరుద్దీన్ సినిమా షూటింగ్‌ను అడ్డుకున్న ఓయు విద్యార్థులు
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజరుద్దీన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌ను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అడ్డుకున్నారు. ఈ షూటింగ్ కోసం దరువు, తెలంగాణ ఉద్యమ చైతన్య వేదిక సంస్థలు ముందస్తుగా అనుమతి తీసుకుని షూటింగ్‌కు ఏర్పాట్లు చేసుకున్నారు.
హైకోర్టు దృశ్యాలను ఆర్ట్స్ కళాశాలలో చిత్రీకరించేందుకు అవసరమైన సామాగ్రి మొత్తం తరలించారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటీనటులు ఇమ్రాన్ హష్మీ, లారా దత్తాలు వచ్చి షూటింగ్ ప్రారంభిస్తుండగా అక్కడికి చేరుకున్న విద్యార్థులు తక్షణమే షూటింగ్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. చిత్రం యూనిట్ వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

దాంతో షూటింగ్ చేయకుండానే సినిమా యూనిట్ వెనుదిరిగింది. షూటింగ్ నిర్వహించుకునేందుకు తాము అన్ని అనుమతులు తీసుకున్నామని, ఇలా షూటింగ్‌ను అడ్డుకోవడం విద్యార్థులకు తగదని చిత్ర నిర్వాహకులు అన్నారు. షూటింగ్ నిలిచిపోవడంతో తమకు దాదాపు రూ.30 లక్షల వరకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కొంతమంది విద్యార్థి నాయకులు వచ్చి తాము అడిగినంత సొమ్ములు ముట్టజెప్పితే షూటింగ్ జరగనిస్తామని, లేదంటే అడ్డుకుంటామని బెదిరించారని వారు చెప్పారు. విద్యార్థుల తీరు వల్ల జాతీయస్థాయిలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్ఠ దెబ్బతింటుందని వారన్నారు.
-
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications