వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆగస్టు నుంచి బీటెక్ విద్యా సంవత్సరం: విద్యా శాఖపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉన్నత విద్యాశాఖపై సీఎం కేసీఆర్ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో వర్సిటీ పరీక్షల నిర్వహణ, విద్యార్థులను ప్రమోట్ చేసే అంశాలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీనియర్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.

Recommended Video

Engineering Colleges to Reopen In August in Telangana విద్యా శాఖపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు!!

ఆగస్టు నుంచి ఇంజినీరింగ్ విద్యాసంవత్సరం..

ఆగస్టు 17 నుంచి ఇంజినీరింగ్ విద్యా సంవత్సరం ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. విద్యార్థులు తమ విలువైన విద్యా సంవత్సరం కోల్పోకుండా ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం రూపొందిస్తుందని స్పష్టం చేశారు. పాఠశాలల పున:ప్రారంభం, విద్యాబోధన ఎలా జరగాలన్న అంశంపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని కేసీఆర్ చెప్పారు.

కేంద్ర మార్గదర్శకాలు, నిపుణుల సూచనలతో..

కేంద్ర మార్గదర్శకాలు, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్ధతిని పరిశీలించి ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విద్యా వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామన్నారు. దీర్ఘకాలిక వ్యూహాలు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. విద్యావేత్తలు, నిపుణులతో సమావేశం నిర్వహించి అభిప్రాయాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు.

విద్యావ్యవస్థ బలోపేతం.. కీలక నిర్ణయాలు..

విద్యావ్యవస్థ బలోపేతం.. కీలక నిర్ణయాలు..

విద్యాసంస్థల, పరీక్షల నిర్వహణ సిలబస్‌పై ప్రభుత్వ, యూజీసీ, ఏఐసీటీఈ తదితర సంస్థల మార్గదర్శకాలను పాటించాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. విద్యావ్యవస్థ బలోపేతం, రెవెన్యూ శాఖ ప్రక్షాళనపై దృష్టి సారిస్తామని చెప్పారు. అనాథ పిల్లలు 10వ తరగతి వరకు కస్తుర్బా పాఠశాలల్లో చదువుతున్నారని,
ఆ తర్వాత కూడా వారి చదువుకు కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వమే తీసుకుంటుందని కేసీఆర్ వివరించారు. ఇందుకు త్వరలోనే విధానపరమైన ఓ నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారు.

ఫైనలియర్‌కు మాత్రమే పరీక్షలు

ఫైనలియర్‌కు మాత్రమే పరీక్షలు

కాగా, కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసిన విషయం తెలిసిందే. డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షలు కూడా యూజీసీ వాయిదా వేసింది. ఈ క్రమంలో ఇంజినీరింగ్ ఫైనలియర్ విద్యార్థులకు మాత్రమే పరీక్షలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, తెలంగాణలో ఇప్పటి వరకు 39,342 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 12,957 యాక్టివ్ కేసులున్నాయి. 386 మంది కరోనాతో మరణించారు.

English summary
B Tech classes from August: CM KCR review on education department.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X