చేసింది బీటెక్.. చేస్తోంది సినీతారల ఫొటోలు మార్ఫింగ్!
సినిమా హీరోయిన్ల ఫొటోలను అశ్లీలంగా మారుస్తున్న బొమ్మ రాహుల్ అనే బీటెక్ స్టూడెంట్‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. అమీర్‌పేట్ లోని ఓ హాస్టల్ లో ఉంటూ హీరోయిన్ల ఫొటోలను రాహుల్ అప్‌లోడ్ చేస్తున్నాడు.
హైదరాబాద్: సినిమా హీరోయిన్ల ఫొటోలను అశ్లీలంగా మారుస్తున్న బొమ్మ రాహుల్ అనే బీటెక్ స్టూడెంట్‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. అమీర్‌పేట్ లోని ఓ హాస్టల్ లో ఉంటూ హీరోయిన్ల ఫొటోలను రాహుల్ అప్‌లోడ్ చేస్తున్నాడు.
సీఐడీ పోలీసులు అతడ్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా రాహుల్ ఇలాంటి ఫొటోలను వెబ్ సైట్ లలో పెడుతున్నట్టుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

సినీ తారల ఫొటోలను అశ్లీలంగా మార్చి వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేస్తుండడాన్ని గమనించిన మా అసోసియేషన్ ఈ విషయంపై పోలీసులకు గతంలోనే ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
మా ఫిర్యాదు నేపథ్యంలో సీఐడీ పోలీసులు పలు వెబ్‌సైట్లు, వాటి నిర్వాహకులపై నిఘా వేశారు. హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల నుంచి వెబ్ సైట్లను కొందరు వ్యక్తులు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన సీఐడీ ఈ మేరకు చర్యలు చేపట్టింది.












Click it and Unblock the Notifications