రైలు కిందపడి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య: తల, మొండెం వేరుచేసి దారుణ హత్య

హైదరాబాద్: కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని పెద్దపల్లి రైల్వే స్టేషన్‌లో రైలు కిందపడి బీటెక్ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని ప్రశాంత్‌గా గుర్తించారు. ప్రశాంత్ పెద్దపల్లిలోని ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.

ప్రశాంత్ స్వస్థలం వరంగల్ జిల్లాలోని చిట్యాల. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 B Tech student commits suicide in peddapalli, karimnagar

తల, మొండెం వేరుచేసి దారుణ హత్య

రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని మంచాల మండలం రంగాపురం సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామ సరిహద్దులో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగానే ఓ వ్యక్తి మొండెం మాత్రమే కనిపించింది.

దీంతో చుట్టుపక్కల పరిసరాల్లో గాలింపు చేపట్టి వ్యక్తి తలను స్వాధీనం చేసుకున్నారు. మృతుడు జిల్లాలోని యాచారం మండలం నర్సక్క మేడిపల్ల గ్రామానికి చెందిన కిరణ్‌గా గుర్తించారు. కిరణ్‌ను హత్య చేసి తల, మొండెం వేరు చేశారా లేదా ఏదైనా ప్రమాదం జరగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బైక్‌ను ఢీకొన్న వోల్వో.. ఇద్దరు మృతి

వరంగల్ జిల్లాలోని ఉర్సుగుట్ట బైపాస్ రోడ్డులో ఆదివారం రాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. బైక్‌పై ముగ్గురు వెళుతుండగా ఎదురుగా వచ్చిన వోల్వో బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పృధ్వీరాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు.

శ్రీకాంత్, శివకృష్ణకు తీవ్ర గాయాలు కావడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ శ్రీకాంత్ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో వోల్వో బస్సు డ్రైవర్‌దే తప్పిదమున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+