హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హీరో ప్రభాస్ సోదరుడు ప్రబోధ్‌కు ఏడాది జైలు శిక్ష

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: చెక్‌ బౌన్స్‌ కేసులో సినీ హీరో ప్రభాస్‌ సోదరుడు యూవీఎస్‌ఎస్‌ఆర్‌ ప్రబోధ్‌కు హైదరాబాదులోని రాజేంద్రనగర్‌ కోర్టు సంవత్సరం జైలు శిక్షను విధిస్తూ తీర్పు చెప్పింది.

బాధితురాలి తరఫు న్యాయవాది పాండురంగారెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి - బిల్లా సినిమా నిర్మాతల్లో ఒకరైన ప్రబోధ్‌ సినిమా నిర్మాణ సమయంలో సికింద్రాబాద్‌కు చెందిన గంగాగనాతే అనే మహిళ దగ్గర రూ.43 లక్షల అప్పు తీసుకున్నారు.

Baahubali fame Prabhas’ brother convicted

గడువుతీరినా అప్పు చెల్లించకపోవడంతో గంగాగనాతే తన డబ్బు ఇచ్చేయాలని కోరింది. దీంతో ప్రబోధ్‌ చెక్కు ఇచ్చాడు. అది బౌన్స్‌ కావడంతో ఆమె మరోసారి అతడిని సంప్రదించింది. ఎంతకీ డబ్బు ఇవ్వకపోవడంతో 2013లో కోర్టును ఆశ్రయించింది.

విచారించిన కోర్టు మంగళవారం తీర్పును వెలువరించింది. నిందితుడికి సంవత్సరం జైలుశిక్షతో పాటు బాధితురాలికి నష్టపరిహారం కింద రెండు నెలల్లో రూ.87 లక్షలు చెల్లించాలని రాజేంద్రనగర్‌ రెండో ప్రత్యేక కోర్టు మెజిస్ట్రేట్‌ సీవీపీఎస్‌ ఛార్లెస్‌ తీర్పు చెప్పారని పాండురంగారెడ్డి వివరించారు.

English summary
Bahubali fame Prabhas’ brother Prabodh was sentenced to a year’s imprisonment in a cheque bounce case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X