పోలీసుల చేతికి చిక్కిన తాయెత్తుల బాబా: భార్యను చంపేసిన భర్త
ఖమ్మం: అమావాస్య రోజు చాలా మంచిది, నీ గ్రహస్థితి బాగాలేదు, తాయత్తులు కట్టి నీకు మంచి జరిగేలా చేస్తానంటూ ప్రజలను మోసం చేస్తున్న బాబాను ఖమ్మం జిల్లా కిన్నెరసాని గ్రామ ప్రజలు సోమవారం పోలీసులకు అప్పగించారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధవారపు పేటకు చెందిన లాల్‌మియా అనే బాబా సోమవారం ఉదయం మండలంలోని కిన్నెరసానికి వచ్చాడు.
కిన్నెరసానికి చెందిన బుడగం సత్యనారాయణ షాపు వద్దకు లాల్‌మియా బాబా వచ్చాడు. వచ్చి రాగానే షాపులో ఉన్న సత్యనారాయణతో నీ గ్రహస్థితి బాగాలేదు, నీ మీద దిష్టి ఉంది. ఇవాళ అమావాస్య, పదివేలిస్తే అది తొలగిపోయి రేపటి నుంచి అంతా మంచే జరుగుతుందని మాటలతో నమ్మించాడు. పదివేలు ఇచ్చుకోలేనని సత్యనారాయణ చెప్పుకుని రూ.3116లకు ఒప్పుకొని డబ్బులు కుడా ఇచ్చేశాడు.

ఇంట్లోని వారికి సాంబ్రాణి వేసిన తాయత్తులు కట్టి ఇంకా అదనంగా ఇతర వస్తువులు కావాలని కోరడంతో సత్యనారాయణ లాల్‌మియా బాబాను షాపులో బంధించి పొలీసులకు ఫోన్ చేశాడు. లాల్‌మియా తీరు పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొలీసులు వచ్చి బాబాను ప్రశ్నించి స్టేషన్‌కు తీసుకువెళ్లారు.
ఇదిలావుంటే, రఘునాథపాలెం మండలంలోని మంచుకొండలో దారుణ సంఘటన జరిగింది. నవీన్ అనే వ్యక్తి తన భార్యను హత్య చేసి పరారీ అయ్యాడు. ఈ క్రమంలో మృతదేహాన్ని ఇంట్లో నుంచి బయటకు పడేసేందుకు నవీన్ సోదరుడు, అతని స్నేహితుడు యత్నించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నవీన్ సోదరుడిని, స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నవీన్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications