అందోల్‌లో బాబు మోహన్‌కు చేదు అనుభవం
సంగారెడ్డి: టీఆర్ఎస్ నేత, అందోల్ ఎమ్మెల్యే బాబు మోహన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ విద్యుత్ ఉప కేంద్రానికి భూమి పూజచేసేందుకు వెళ్లిన ఆయనకు స్థానిక కాంగ్రెస్ నాయకులు, స్థానికుల నుంచి నిరసన సెగ తగిలింది.
సంగారెడ్డి జిల్లాలోని అందోల్‌లో రూ.1.50 కోట్లతో నిర్మించనున్న విద్యుత్తు ఉపకేంద్రం పనులకు భూమి పూజ చేసేందుకు ఎమ్మెల్యే బాబు మోహన్ జిల్లా పాలనాధికారి వాసం వెంకటేశ్వర్లుతో కలిసి విచ్చేశారు.

ఆ స్థలాన్ని గతంలో ఓ సంఘానికి కేటాయించి ఇప్పుడు విద్యుత్తు ఉప కేంద్రానికి ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ శ్రేణులు, స్థానికులు ఎమమెల్యేను అడ్డుకున్నారు. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాబు మోహన్ పనుల్ని ప్రారంభించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications