కేసీఆర్! దిమ్మతిరిగిలా.. నేనెంటో చూపిస్తా: బాబు మోహన్ హెచ్చరిక
Recommended Video

కరీంనగర్: తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి షాకిస్తూ బీజేపీలో చేరిన తాజా మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ పాత పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. టీఆర్ఎస్ అధిష్టానం ఆందోల్ టికెట్ తనకు కేటాయించకపోవడంతో ఇటీవల బాబు మోహన్.. అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

ఇంతటి నియంతను చూడలేదు
కరీంనగర్ జిల్లాలో సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో పాల్గొన్న బాబు మోహన్ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ లాంటి నియంత సీఎంను తాను ఇదివరకెప్పుడూ చూడలేదని విమర్శించారు.

నేనెంటో చూపిస్తా..
ఫాంహౌస్‌లో ముసుగేసుకుని పాలన సాగించిన ఏకైక సీఎం కేసీఆరేనని బాబు మోహన్ ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో తన వాగ్ధాటి ఏమిటో కేసీఆర్‌కు చూపిస్తానంటూ హెచ్చరించారు.

కేసీఆర్‌కు దిమ్మతిరిగేలా..
తనను చులకనగా చూసిన కేసీఆర్‌కు తన ప్రతాపమెంటో చూపించి దిమ్మతిరిగేలా సమాధానం చెబుతానని బాబు మోహన్ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్‌పై తాను విమర్శలు చేయడం ఇది ఆరంభం మాత్రమేనని, అక్టోబర్ 10 నుంచి కేసీఆర్‌పై విమర్శల దాడి పెంచుతానని బాబు మోహన్ అన్నారు.

ఆందోల్ టికెట్ నిరాకరించడంతో..
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన టీఆర్ఎస్ తొలి జాబితాలో ఆందోల్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన బాబు మోహన్ పేరు లేకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తాను నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశానని, పార్టీ కోసం ఎంతగానో కష్టపడి పనిచేశానని అయినా తనకు టికెట్ నిరాకరించడం ఏంటని బాబు మోహన్ ప్రశ్నించారు. టికెట్ ఇవ్వకపోవడం అవమానంగా భావించిన బాబు మోహన్ చివరకు ఆ పార్టీని వీడి బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీ నుంచే ఆయన పోటీ చేసే అవకాశం ఉంది.
-
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications