iBomma Ravi ఉదంతంలో కొత్త కోణం: మిర్రర్ సైట్లు సైతం..!!
సినిమాల పైరసీ కాపీలను ఆన్ లైన్ లో విడుదల చేసిన వ్యవహారంలో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవి అలియాస్ ఇమ్మడి రవికి బిగ్ షాక్ తగిలింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటీషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. బెయిల్ ఇస్తే విదేశాలకు పారిపోయే అవకాశం ఉన్నందున న్యాయమూర్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో హైదరాబాద్ పోలీసుల తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించారు. దీంతో ఐబొమ్మ రవి ఇప్పట్లో బయటికి రావడం గగనమే అయింది. ఇంకొన్నాళ్ల పాటు ఆయన పోలీసుల విచారణలో కొనసాగనున్నారు.
ప్రస్తుతం ఆయన హైదరాబాద్ పోలీసుల విచారణలో ఉన్నారు. మొత్తం అయిదు కేసుల్లో రవి.. విచారణను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఈ అయిదు కేసుల్లోనూ పిటీషన్లను దాఖలు చేశారు. వాటిని కోర్టు విచారణకు స్వీకరించింది. నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. రవికి విదేశాల్లో పౌరసత్వం ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు.

బెయిల్ ఇస్తే దేశం దాటి పోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. వారి వాదనలతో కోర్టు ఏకీభవించింది. అయిదు బెయిల్ పిటీషన్లనూ కొట్టివేసింది. ఇమ్మడి రవి విచారణ సందర్భంగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏడేళ్లుగా అక్రమ బెట్టింగ్ యాప్‌ల ద్వారా సంపాదించిన ఆదాయంతో విదేశాల్లో భారీగా ఆస్తులను కూడబెట్టినట్లు పోలీసులు గుర్తించారు. దీని వివరాల గురించి పోలీసులు ఆరా తీస్తోన్నారు. 25 మంది దేశ, విదేశీ సాంకేతిక నిపుణులతో సినిమాలు పైరసీ చేస్తున్నట్లు అతను అంగీకరించాడు.
ఐబొమ్మ, ఐబొమ్మ వన్ వంటి మిర్రర్ వెబ్‌సైట్ల కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేశాడు. కరీబియన్ దీవుల్లోని తన నివాసం సమీపంలో 'వార్ హౌస్' నుంచే కార్యకలాపాలు నిర్వహించినట్లు విచారణలో వెల్లడించాడు. తన సహచరులు, టెక్నికల్ టీమ్, ఏజెంట్లు, మేనేజర్ల వివరాలను రాతపూర్వకంగా ఇవ్వాలని పోలీసులు ఆదేశించారు. దర్యాప్తునకు సహకరించకుంటే అదనపు కేసుఅను ఎదుర్కొనాల్సి ఉంటుందనీ హెచ్చరించారు.
ప్రీరిలీజ్ సినిమాల ప్రసారం, దీనికోసం వినియోగించిన సాఫ్ట్‌వేర్, వాటి మూలాల గురించీ ఆరా తీస్తోన్నారు. ఐబొమ్మకు సినిమా సరఫరా చేసిన వారి వివరాలను గుర్తించారు. కోట్ల రూపాయల 'మూవీ రూల్స్' వెబ్‌సైట్ ద్వారా క్రిప్టో కరెన్సీ లావాదేవీలు జరిగాయని, ఐబొమ్మ బెట్టింగ్ యాప్‌లకు గేట్‌వేగా పనిచేసిందని మల్టీ లేయర్డ్ వెబ్‌సైట్‌లలో సినిమాలు ప్రసారం చేస్తూ, వాటిపై బెట్టింగ్ యాప్‌లను పోస్ట్ చేయడం ద్వారా ఈ ఆదాయం సమకూరిందని తెలిపాడు.
-
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications