Balagam Mogilaiah: బలగం మొగిలయ్య పరిస్థితి ఆందోళనకరం.. హైదరాబాద్‍కు తరలింపు..
పచ్చని సంసారమురా నా కొడుక.. చెడగొట్టుకోవద్దురా నా కొడుక.. అంటూ బలగం సినిమాలో అందరిని కంటతడి పెట్టించిన మొగిలయ్య, కొమురమ్మ దంపతులను బాధలు చుట్టుముట్టాయి. మొగిలయ్యకు కరోనా టైమ్ లోనే రెండు కిడ్నిలు ఫేలయ్యాయి. ఆయన అప్పటి నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నారు. అయితే మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది.
మొగిలయ్యను అనారోగ్యంతో పాటు ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పెడుతున్నాయి. మొగిలయ్యకు కళ్లు కూడా సరిగా కనబడడం లేదు. బలగం సినిమాలో తన పాటతో కోట్లాది మంది హృదయాలను కదిలించిన మొగిలయ్య, కొమురమ్మ దంపతుల నిజ జీవిత గాథ అందరని కదిలిస్తోంది.

పస్తం మొగిలయ్య స్వస్థలం వరంగల్ జిల్లా దుగ్గొండి గ్రామం. మొగిలయ్య దంపతులు ఊరూరా తిరుగుతూ కథలను గానం చేస్తూ ఉపాధి పొందేవారు. వీరిని చూసిన బలగం సినిమా డైరెక్టర్ వేణు బలగం సినిమా క్లైమాక్స్ లో వీరి పాటతో పాటు నంటించే అవకాశం కల్పించారు.
సినిమా చివరలో వీరు చేసిన కథా గానం చిత్రానికి హైలెట్ గా నిలిచింది. ఈ కథ గానంలో మొగిలయ్య, కొమురమ్మ దంపతులు బంధాల గురించి చాలా చక్కగా వివరించారు. ముఖ్యంగా రక్తం పంచుకుని పుట్టే అన్నదమ్ములు, అక్క చెల్లెలపై వారు చేసిన యాక్షగానం ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టించింది.
ప్రస్తుతం వరంగల్ లోని సంరక్ష ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మొగిలయ్య.. కిడ్నీ వ్యాధితో పాటు ఆయనకు గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో మెుగిలయ్యను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.












Click it and Unblock the Notifications