Balagam: బలగం సినిమాకు 100 అంతర్జాతీయ అవార్డులు..!
బలగం సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలుసు. చిన్న సినిమా తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను రాష్ట్రంలోని దాదాపు అన్ని ఊళ్లలో ప్రదర్శించారు. ఈ చిత్రం దూరమవుతున్న సంబంధబంధావ్యాలను దగ్గర చేసింది. ఈ సినిమా చివరిలో మొగిలయ్య, కొమురమ్మలు పాడే పాట అందరిని కంటతడి పెట్టిస్తుంది. అన్నదమ్ములు, అక్కచెల్లెల్లు కలిసి ఉండాలని ఆ పాటలో వారు చెబుతారు.
ఈ సినిమాకు వెల్డండి వేణు దర్శకత్వం వహించగా.. బీమ్స్ సంగీతం అందించారు. ఈ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను మెప్పించాయి. ఊరు పల్లెటూరు, బలరామ నర్సయ్య పాటలు సూపర్ హిట్టయ్యాయి. కామెడియన్ గా కేరిర్ ప్రారంభించిన వేణు ఈ సినిమా దర్శకుడిగా మారి మంచి పేరు సంపాదించుకున్నాడు. తాజాగా బలగం చిత్రం అరుదైన ఘనత సొంతం చేసుకుంది.

ఈ చిత్రం వందకు పైగా అంతర్జాతీయ అవార్డులను అందుకున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది."మా ప్రయాణానికి అద్భుతమైన గుర్తింపు లభించింది. గతంలో ఓ సినిమా 100 రోజులు ఆడేది ఆ తర్వాత 100 సెంటర్లలో సినిమాలు ఆడేవి ఆ తర్వాత 100 కోట్ల వసూళ్లు చేసే సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మేము 100 కు పైగా అంతర్జాతీయ అవార్డులను పొందిన ఘనత సాధించాం. 'బలగం' మాకు ప్రత్యేకమైన సినిమా" అంటూ చిత్ర బృందం పోస్ట్ చేసింది.
A journey of Excellence and Recognition! ❤️
— BA Raju's Team (@baraju_SuperHit) July 4, 2023
Earlier, we had
Films running for 100 days..
Films running in 100 centers..
Films collecting 100 crores ..
Now, we have achieved a film with 100+ international awards ❤️#Balagam is a special film for many reasons 🤗🤗… pic.twitter.com/aaqzeVtYMx
#balagam @PriyadarshiPN @KavyaKalyanram @LyricsShyam @DilRajuProdctns @dopvenu @vamsikaka pic.twitter.com/s1Eudbjpij
— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) July 4, 2023
బలగం సినిమాను సిరిసిల్ల పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఈ బలగం సినిమా చూసి ఎన్నో కుటుంబాలు కలిసిపోయాయి. ఎంత మంది తమ కోపాలను పక్కకు ఒక్కటయ్యారు.












Click it and Unblock the Notifications