హైదరాబాద్‌లో సీఎం సహకారం: కేసీఆర్‌కు బాలకృష్ణ థ్యాంక్స్
హైదరాబాద్: హిందూపురం టిడిపి ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ధన్యవాదాలు తెలిపారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి అభివృద్ధికి సహకరిస్తున్న కేసీఆర్‌కు థ్యాంక్స్ చెప్పారు.
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి పదహారు వసంతాలు పూర్తి చేసుకుంది. హైదరాబాదులో జరిగిన ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడారు. రోగులకు అత్యాధునిక చికిత్స అందిస్తున్నామని చెప్పారు.

కోడెల మాట్లాడుతూ.. భవిష్యత్తులో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి మరింతమందికి సేవలు అందించాలని అన్నారు. బసవతాకరకంకు ప్రపంచస్థాయి గుర్తింపు వస్తుందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా క్యాన్సర్ పేషెంట్లకు సేవలు అందిస్తున్న ఈ ఆసుపత్రి ఎన్టీఆర్‌కు ఆత్మలాంటిది అన్నారు. క్యాన్సర్ చికిత్సతో పాటు నివారణపై అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యమన్నారు.












Click it and Unblock the Notifications