హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హీరో బాలప్రశాంత్ మృతిలో కొత్త కోణం: కారులో వచ్చి దొరికిపోయాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హీరో బాలప్రశాంత్ మృతి కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. స్కోడా కారులో రావడమే అతని మృతికి కారణమైందనే వాదన వినిపిస్తోంది. ఈ నెల 13వ తేదీన ప్రేయసి భర్త అనంతపురంలోని ఓ ఫంక్షన్‌కు వెళ్లాడు.

మీడియాలో వచ్చిన వార్తాకథనాల ప్రకారం - తాను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నానంటూ బాలప్రశాంత్‌ను ప్రేయసి ఆహ్వానించింది. దాంతో బాలప్రశాంత్ పవర్‌నగర్‌లో ప్రేయసి ఇంటికి వెళ్లాడు. అయితే, ఆమె భర్త బావమరిదికి ఫోన్ చేసి ఇంట్లో మీ ఒక్క ఒక్కతే ఉంది, ఇంటికి వెళ్లాలని చెప్పాడు. దీంతో అతను ఇంటికి వెళ్లి తలుపు కొట్టాడు. తాను నిద్రపోతున్నానని వెళ్లిపోవాలని ఆమె సోదరుడికి చెప్పింది.

Balaprashanth death: Skoda car is the main reason

ఆ విషయాన్ని బావమరిది బావకు చెప్పాడు. దాంతో భర్తకు అనుమానం వచ్చింది. సెల్లార్‌లో వాహనాలు ఉన్నాయేమో చూడాలని చెప్పాడు. స్కోడా కారు ఉందని చెప్పడంతో అనుమానం వచ్చి భర్త - తన అక్కాబావలను తన ఇంటికి వెళ్లాల్సిందిగా చెప్పాడు. వారు వెళ్లగానే ఆమె గడియ తీసింది. తనను ప్రశాంతంగా ఉండానీయాలంటూ వారిని బెదిరించడానికి ఆమె చేయి కోసుకుంది.

దాంతో ఆమెను ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. ఎలాగైనా తప్పించుకో అంటూ అస్పత్రి నుంచి బాలప్రశాంత్‌కు ఆమె మెసేజ్ పెట్టింది. అలాగేనంటూ అతను రిప్లై ఇచ్చాడు. అలా తప్పించుకునే క్రమంలోనే బాలప్రశాంత్ అపార్టుమెంటుపై నుంచి పడి మృతి చెందినట్లు భావిస్తున్నారు. కాగా, మూసాపేటలోని అంజనేయనగర్‌లో బాలప్రశాంత్ నిర్వహిస్తున్న డ్యాన్స్ స్కూల్‌కు తన కూతురిని రెండేళ్లుగా పంపిస్తోందని, ఈ క్రమంలోనే ఆమె అతనికి దగ్గరైందని అంటున్నారు.

English summary
A new angle has been revealed Cine hero Bala Prashanth's death case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X