పెళ్లి ఊసుల‌ను నెమ‌రు వేసుకున్న బాల్క‌ సుమ‌న్..! అసెంబ్లీ సాక్షిగా ప్రేమ ప్ర‌స్తావ‌న‌..!!

హైద‌రాబాద్ : ప్రేమ‌లు పెళ్లిళ్లు, బంధాలు-అనుబంధాలు ఎక్క‌డ ఎప్పుడు ఎలా మొద‌లౌతాయో ఊహించ‌డం చాలా క‌ష్టం. మ‌న‌సుకు న‌చ్చిన వారు మ‌న జీవితాంతం తోడై ఉంటానంటే ఆ అనుభూతి మాట‌ల్లో వ‌ర్ణించ‌లేద‌నిది. ఇలాంటి అనుభూతినే ఓ యువ ఎమ్మెల్యే శాస‌న స‌భ‌లో స‌హ‌చ‌ర ఎమ్మెల్యేల‌తో పంచుకున్నారు. ఇలాంటి అనుదైన సంఘ‌ట‌న‌కు తెలంగాణ అసెంబ్లీ వేదిక‌య్యింది.

అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన సికింద్రాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు సభలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చెన్నూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ, పద్మారావు గౌడ్‌తో తన వ్యక్తిగత అనుబంధం గురించి సభలోని సభ్యులతో పంచుకున్నారు. తన ప్రేమ వివాహానికి పద్మారావు గౌడ్ అన్నీ తానై ముందు నిలిచారని, ఆయన వల్లే తన వివాహం జరిగిందని చెప్పుకొచ్చారు.

ఇలాంటి వ్య‌క్తిగ‌త విష‌యాలు చ‌ట్ట‌స‌భ‌ల్లో చెప్పొచ్చో చెప్ప‌కూడ‌దో తనకు తెలియదని, కానీ పద్మారావు గౌడ్‌తో తనకున్న అనుబంధం గురించి చెప్పడానికి ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నానని తెలిపారు. ఉద్యమ సమయంలో టీఆర్ఎస్‌వి అధ్యక్షుడిగా పనిచేస్తున్నప్పుడు, వివాహానికి తన అత్త మామలు ఒప్పుకోలేదన్నారు. తాను ప్రేమించిన అమ్మాయి పద్మారావు సామాజిక వర్గానికే చెందినవారని, ఆ సమయంలో తనకంటూ ఏది లేదు కాబట్టి అత్త మామలు పిల్లనివ్వడానికి వెనుకాడారని చెప్పారు.

Balka Suman recollected his wedding incident..! Love affair revealed in assembly..!!

దాంతో పద్మారావు అన్ననే వారితో మాట్లాడి ఒప్పించారని, భవిష్యత్తులో సుమన్ ఎమ్మెల్యే అవుతాడని పద్మారావు భరోసా ఇవ్వడంతో తన అత్త మామలు పెళ్లికి ఒప్పుకున్నట్టు సుమన్ తెలిపారు. పద్మారావు గౌడ్ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైనందుకు సుమ‌న్ ఆయ‌న‌కు ప్ర‌త్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+