విషాదం: గుండెపోటుతో బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ మృతి

హైదరాబాద్: మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కుటుంబంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్(21) అకస్మికంగా మృతి చెందారు.

 bandaru dattatreyas son dies with heart attack

ముషీరాబాద్‌లోని గురునానక్ ఆస్పత్రిలో వైష్ణవ్ గుండెపోటుతో మరణించారు. ఆయన ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నారు. కుమారుడి మరణంతో బండారు దత్తాత్రేయ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్న వయసులో వైష్ణవ్‌ గుండెపోటుతో మృతి చెందడంతో పలువురు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

 bandaru dattatreyas son dies with heart attack

కాగా, బీజేపీలో సీనియర్ నేతగా ఉన్న బండారు దత్తాత్రేయ ప్రస్తుతం లోకసభ ఎంపీగా కొనసాగుతున్నారు. మొన్నటి వరకు మోడీ కేబినెట్లో మంత్రి‌గా ఉన్న ఆయన.. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో పదవిని కోల్పోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+