KTR vs Bandi Sanjay : వామ్మో.. ఇవేం తిట్లు..!

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్‌ సిట్‌ ముందు విచారణకు హాజరైన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ లోని దిల్‌ కుష్ భవన్ లో సిట్‌ విచారణకు హాజరైన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో అత్యధికంగా తన ఫోన్‌ కాల్స్‌ నే ట్యాప్‌ చేశారని.. తన కుటుంబ సభ్యులు, పని మనుషుల ఫోన్లు కూడా ట్యాప్‌ చేశారని బండి సంజయ్ ఆరోపించారు. ఆఖరికి భార్యాభర్తల ఫోన్లూ ట్యాప్‌ చేసి విన్నారని.. నా వద్ద ఉన్న ఆధారాలు, సమాచారం అధికారులకు ఇచ్చానన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారులుగా ఉన్న రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్‌ కు పాల్పడ్డారని.. అందుకు వారికి ఉరిశిక్ష విధించాలని బండి సంజయ్ సంచలన డిమాండ్ చేశారు. అయితే దీనిపై బీఆర్ఎస్ నేత కేటీఆర్‌ స్పందించారు. ఆరోపణలను ఉపసంహరించుకుని 48 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకపోతే లీగల్‌ నోటీసులు పంపిస్తానని హెచ్చరించారు.

ఈ క్రమంలో తాజాగా మరోసారి కేటీఆర్ పై బండి సంజయ్ రెచ్చిపోయారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తడిబట్ట ప్రమాణానికి తాను సిద్దంగా ఉన్నానని.. ఏ గుడికి రావాలో టైం చెప్పు వస్తానంటూ కేటీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు. నాతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని. మావోయిస్టు సానుభూతిపరులుగా తమ నంబర్లను పోలీసులకు ఇచ్చారని మండిపడ్డారు. BRS నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయని.. ఆ పార్టీ నేతలకు సిగ్గుంటే పార్టీని వీడి బయటికి రావాలని బండి సంజయ్ అన్నారు. కేటీఆర్ ఏ గుడికి, ఎప్పుడు రమ్మంటారో చెబితే తాను భార్యా పిల్లలతో వస్తానని సవాలు చేశారు. మా గుడులపై నమ్మకం లేకుంటే ఏదైనా మసీదు, చర్చి పేరు చెప్పినా ఫరవాలేదని.. కేటీఆర్, కేసీఆర్ కుటుంబంతో రావాలన్నారు.

Bandi Sanjay Dares KTR to Temple Vow Over Phone Tapping Allegations

ఫోన్ ట్యాపింగ్ తో బ్లాక్ మెయిల్ చేసి కేసీఆర్ వేల కోట్ల రూపాయలు సంపాదించారని బండి సంజయ్ అన్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో కేసీఆర్ మమత బెనర్జీకి ఎన్నికల ఫండ్ ఇచ్చారని.. అంతేకాక మహారాష్ట్ర ఎన్నికల సమయంలో కూడా కేసీఆర్ ముంబై వెళ్లి ఎన్నికల ఫండ్ ఇచ్చారని ఆరోపణలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+