అంబేద్కర్ ఆలోచనలను వ్యతిరేకిస్తూ అవమానిస్తోంది: కాంగ్రెస్‌పై బండి సంజయ్
కరీంనగర్: దేశంలోని దళితులకు తమ ప్రభుత్వంలోనే మేలు జరిగిందని, దళితులను అభివృద్ధి పథంలో నడిపింది బీజేపీనేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ వారిని ఓటు బ్యాంక్‌గా వాడుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. గతంలో అంబేద్కర్ ఆలోచనలకు వ్యతిరేకంగా పని చేసిన పార్టీ కూడా హస్తం పార్టీనేనని అన్నారు.
కరీంనగర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్సీ మోర్చా కార్యక్రమంలో పాల్గొని బండి సంజయ్ ప్రసంగించారు. అంబేడ్కర్‌ను అడుగడుగున అవమానిస్తున్న పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు. తమ పార్టీ ప్రభుత్వం దళితులను ఏకంగా రాష్ట్రపతి పదవిలోనే కూర్చోపెట్టామని గుర్తు చేశారు. పేదలకు గురించి ఆలోచిస్తూ గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేశామని తెలిపారు.

సంక్షేమ పథకాలు అందిస్తూ సంవత్సరానికి లక్షకు పైగా దళితులను వ్యాపారస్తులను చేస్తున్నామని బండి సంజయ్ చెప్పారు. అంబేడ్కర్‌ను ఆలోచనలకు వ్యతిరేకంగా దేశంలో కాంగ్రెస్ పార్టీ పని చేసిందని మండిపడ్డారు. వారిని ఓటు బ్యాంక్‌గా వాడుకుందే తప్పా చేసిందేమీ లేదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
దళితులను ఓటు బ్యాంకుగా వాడుకుంది తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదు. అధికారంలోకి రావాలన్న కుట్రతో దళితుడిని సీఎం చేస్తా అని కేసీఆర్ అన్నారు. అన్ని రకాలుగా దళితులను మోసం చేసింది కేసీఆర్ అని అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు బండి సంజయ్.
Live : Karimnagar BJP SC Morcha Sammelanam https://t.co/nl2WvD34VN
— Bandi Sanjay Kumar (Modi Ka Parivar) (@bandisanjay_bjp) April 26, 2024
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయిన దళితులకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిందా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం తాను చొరవ చూపిస్తేనే నిర్మాణం పూర్తి చేశారని బండి సంజయ్ తెలిపారు. కాగా, గురువారం బండి సంజయ్ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కరీంనగర్‌లో భారీ ర్యాలీ తీశారు. బీజేపీకి ఓటేసి మరోసారి నరేంద్ర మోడీని ప్రధాని చేయాలని కోరారు బండి సంజయ్.












Click it and Unblock the Notifications