రేవంత్ కన్నీటి వెనుక కారణం ఇదే - బండి సంజయ్..!!
భాగ్యలక్ష్మీ దేవాలయం వద్ద రేవంత్ కన్నీటి పై బండి సంజయ్ స్పందించారు. మునుగోడు బై పోల్ వేళ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి రూ 25 కోట్లు తీసుకుందంటూ చేసిన కామెంట్స్ రాజకీయంగా కలకలానికి కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యల పైన రేవంత్ భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద ప్రమాణంకు రావాలని సవాల్ చేసారు. తన పైన వచ్చిన ఆరపణలతో రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రమాణం సైతం చేశారు. ఆ సమయంలో ఉద్వేగానికి లోనయ్యారు. కన్నీరు పెట్టారు. దీనికి కొనసాగింపుగా బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేసారు.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ రూ 25 కోట్లు తీసుందన్న ఈటల వ్యాఖ్యలను బండి సంజయ్ సమర్దించారు. కాంగ్రెస్ పార్టీ ఆ మొత్తాన్ని తీసుకుందని ఈటల అన్నారని, రేవంత్ తీసుకున్నట్లుగా ఎక్కడా పేరు ప్రస్తావన చేయలేదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పూర్తిగా ఇప్పుడు బీఆర్ఎస్ చేతిలోకి వెళ్లిపోయిందన్నారు. రేవంత్ రెడ్డి తన పదవి పోతుందనే ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకున్నారని సంజయ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అంత ర్గత కుమ్ములాటలతో రేవంత్ సతమతం అవుతన్నారని పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ ఆర్దిక సాయం చేస్తోందన్నారు. దేశమంతా బీఆర్ఎస్ పార్టీలకు ఆర్దికంగా తోడ్పాటు అందిస్తోందని సంజయ్ కీలక వ్యాఖ్యలు చేసారు.

బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు ఖాయమని రేవంత్ కన్నీరు పెట్టుకున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి సీఎం కావాలనుకున్నారు కానీ, పీసీసీ అధ్యక్షుడిగా తనను మారుస్తారని రేవంత్ బాధ పడ్డారని చెప్పుకొచ్చారు, ఆ బాధే కన్నీరుగా వచ్చిందని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి బాధపడి ఏడవటంలో తప్పులేదని చెప్పారు. అతిక్ అహ్మద్ లాంటి గూండా కోరు చనిపోతే ఎంఐఎం సంతాప సభలు పెట్టడం ఏంటి అని నిలదీశారు. అతని మరణం పై జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే స్పందించడం సిగ్గుచేటు అని ఆయన విమర్శించారు. తెలంగాణకు బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు అవసరమా అంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications