సీబీఐ ఛాయ్ బిస్కెట్లు కోసం రాలేదు.: కవితపై బండి సంజయ్, సీఎం పదవిపైనా

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో లక్షల కోట్లు దోచుకున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మహిళ కాబట్టే.. ఇంటికి వెళ్లి సీబీఐ విచారణ చేస్తోంది కావొచ్చన్నారు. సీబీఐ అధికారులు ఛాయ్ బిస్కెట్లు తినడానికి రాలేదని వ్యాఖ్యానించారు.

కవిత సహా బీఆర్ఎస్ నేతలంతా జైలుకేనంటూ బండి సంజయ్

కవిత సహా బీఆర్ఎస్ నేతలంతా జైలుకేనంటూ బండి సంజయ్

ఆయన ఆదివారం మాట్లాడుతూ.. కవిత ఏమైనా స్వాతంత్ర్య సమరయోధురాలా? ఇంటి దగ్గర పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఎందుకు? తప్పు చేసినవారు హోర్డింగ్స్ పెట్టుకుంటున్నారని విమర్శించారు. తప్పు చేసిన బీఆర్ఎస్ నేతలంతా జైలుకు వెళ్లాల్సిందేనని బండి సంజయ్ అన్నారు. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. లిక్కర్ స్కాం కేసులో కవిత దొరికిపోయారని, చట్టం తన పని తాను చేస్తుందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

టీఆర్ఎస్ భయపడుతోంది, అందుకే తప్పుడు ప్రచారం: బండి

టీఆర్ఎస్ భయపడుతోంది, అందుకే తప్పుడు ప్రచారం: బండి

బీజేపీ శక్తివంతమైన పార్టీ కాబట్టే.. షర్మిల తమ పార్టీ మనిషి అని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ఎక్కడైనా సింగిల్ గానే పోటీ చేస్తుందన్నారు. తన పాదయాత్రకు స్వచ్ఛందంగానే వేలాది మంది వస్తున్నారని.. ప్రజా సంగ్రామ యాత్రకు వస్తున్న స్పందన చూసి టీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని బండి సంజయ్ అన్నారు. డిసెంబర్ 15న ప్రజా సంగ్రామ యాత్ర కరీంనగర్ ఎస్ఆర్ఎర్ కాలేజీ వద్ద ముగిస్తుందన్నారు. ముగింపు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారని తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలు హాజరుకావాలని పిలుపునిచ్చారు.

 తాను సీఎం అభ్యర్థిని కాదంటూ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

తాను సీఎం అభ్యర్థిని కాదంటూ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

ఎన్నికలకు ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించే పార్టీ కాదని చెప్పారు బండి సంజయ్. ప్రత్యేక కమిటీ, పార్లమెంట్ పార్టీ బోర్డు మాత్రమే సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తాయని చెప్పారు. కొంతమంది తన పేరు రాస్తున్నారని.. అలా చేయవద్దని అన్నారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకునే అధికారం కూడా తనకు లేదని బండి సంజయ్ తెలిపారు. అసలు తాను పోటీ చేయాలా? వద్దా? అనేది పార్టీ నిర్ణయిస్తుందని బండి సంజయ్ తెలిపారు.

కవితను విచారిస్తున్న సీబీఐ అధికారులు

కవితను విచారిస్తున్న సీబీఐ అధికారులు

కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు ఆమె నివాసంలో రికార్డు చేస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం 11 గంటలకు కవిత నివాసానికి చేరుకున్న సీబీఐ అధికారులు.. ఆమెను విచారిస్తున్నారు. సీబీఐ టీంను రాఘవేంద్ర వత్స లీడ్ చేస్తున్నారు. స్కాంకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+