పప్పు జీ అంటూ! రాహుల్ వ్యాఖ్యలకు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో రాహుల్ వ్యాఖ్యలకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. మీ స్క్రిప్ట్ రైటర్‌ను మార్చుకోండి పప్పూజీ అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

'1400 మంది అమరవీరుల మరణానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సిగ్గు లేకుండా ప్రధాని మోడీని ప్రశ్నించడం విడ్డూరం. తెలంగాణకు మంచి ఏదైనా జరిగిందంటే.. అది ప్రధాని మోడీ వల్లేనని బండి సంజయ్ తెలిపారు.ఒకే ఓటు - రెండు రాష్ట్రాలు అనే పిలుపునిచ్చింది అటల్ బిహారీ వాజ్‌పేయి అని చెప్పారు. మీ ముత్తాత నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణను మోసం చేసిందని రాహుల్‌ను ఉద్దేశించి ధ్వజమెత్తారు.

Bandi Sanjay slams rahul gandhi and congress for ap bifurcation issue

వందలాది మంది అమరవీరుల మరణానికి కారణమైనందుకు మీరు, మీ కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పాలి? అని బండి సంజయ్.. రాహుల్ గాంధీని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పలు అంశాలను బండి సంజయ్ ప్రస్తావించారు. జవహర్‌లాల్ నెహ్రూ - జెంటిల్‌మన్ ఒప్పందం పేరుతో తెలంగాణను ఆంధ్రాలో విలీనం చేశారు. ఇందిరా గాంధీ - కాంగ్రెస్ ప్రభుత్వం కారణంగా 1969లో దాదాపు 369 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు బండి సంజయ్.

1956లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన రోజు నుంచి తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతామని 1985లో రాజీవ్ గాంధీ హామీ ఇచ్చారు. ఇక, సోనియా గాంధీ - 2009 తెలంగాణా ప్రకటించి ఆ తర్వాత వెనక్కి తగ్గారు. 1400 మంది ప్రాణాలను బలిగొన్న తర్వాత రాబోయేది బీజేపీ ప్రభుత్వం అని తెలిసి బిల్లును ప్రవేశపెట్టారు అని బండి సంజయ్ కాంగ్రెస్ విమర్శలు గుప్పించారు.

కాగా, 'తెలంగాణ అమరులను, వారి త్యాగాలను అవహేళన చేస్తూ ప్రధాని మోడీ మాట్లాడటం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అవమానపరచడమే' అని రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. అయితే, నాటి యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విభజనను సరైన రీతిలో చేయలేదని, అందుకే రెండు రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయని ప్రధాని మోడీ పార్లమెంటులో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మోడీ వ్యాఖ్యలపై అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. వారికి బీజేపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+