హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేటీఆర్.. మాకు సంక్షేమంపై లెక్చర్ ఇస్తారా? మీకు రోజులు దగ్గరపడ్డాయి: బండి సంజయ్ వార్నింగ్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ వేదికగా జరుగుతున్న బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. అధికార టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ప్రస్తుత పరిస్థితి కొనసాగుతుంది. ఇక ప్రధాని నరేంద్ర మోడీ నేడు జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనడానికి హైదరాబాద్ కు రానున్న నేపథ్యంలో మోడీని టార్గెట్ చేస్తూ కేటీఆర్ లేఖ రాశారు. ఆవో.. దేఖో.. సీఖో .. అంటూ పేర్కొన్న ఆయన, తెలంగాణ రాష్ట్రానికి వచ్చి తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి, సంక్షేమాన్ని చూసి నేర్చుకోవాలని హితవు పలికారు.

మంత్రి కేటీఆర్ మోడీకి రాసిన లేఖకు బండి సంజయ్ కౌంటర్

మంత్రి కేటీఆర్ మోడీకి రాసిన లేఖకు బండి సంజయ్ కౌంటర్
మంత్రి కేటీఆర్ రాసిన లేఖకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు. సంక్షేమం గురించి మీరు మాకు లెక్చర్ ఇస్తారా అంటూ మండిపడ్డారు. ఎప్పుడూ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఉండే కుటుంబం, అడుగడుగునా ప్రజలకు ద్రోహం చేసిందని బండి సంజయ్ విమర్శించారు. కెసిఆర్ కుటుంబం నిరుద్యోగ యువతను మోసం చేసిందని , అమరవీరుల ఆకాంక్షలను తుంగలో తొక్కిందని బండి సంజయ్ నిప్పులు చెరిగారు.

మీకు రోజులు దగ్గర పడ్డాయి అంటూ బండి సంజయ్ ఆగ్రహం

మీకు రోజులు దగ్గర పడ్డాయి అంటూ బండి సంజయ్ ఆగ్రహం

కేసీఆర్ కుటుంబం మూఢనమ్మకాలను నమ్ముతుందని బండి సంజయ్ ఆరోపించారు. అలాంటి కుటుంబం ఇప్పుడు మాకు సంక్షేమంపై ఉపన్యాసం ఇవ్వాలనుకుంటున్నారా అంటూ ఎద్దేవా చేశారు. మీకు రోజులు దగ్గర పడ్డాయి, తెలంగాణ ప్రజలు మీకు తగిన గుణపాఠం చెబుతారు అని బండి సంజయ్ మంత్రి కేటీఆర్ లేఖకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణా రాష్ట్రంలో అధికారంలో ఉన్నా ఫామ్ హౌస్ దాటి రాని ముఖ్యమంత్రి అంటూ టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు బండి సంజయ్.

బీజేపీ సమావేశాలు పెట్టటానికి మీ అనుమతి తీసుకోవాలా?

బీజేపీ సమావేశాలు పెట్టటానికి మీ అనుమతి తీసుకోవాలా?

అంతేకాదు సీఎం కేసీఆర్ సంగతి తేల్చడం కోసమే హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు బండి సంజయ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అవినీతి చిట్టాను త్వరలోనే విప్పుతామని బండి సంజయ్ హెచ్చరించారు. బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో ఎందుకు పెడుతున్నారు అని అడుగుతున్నారు అని.. తెలంగాణ పాకిస్థాన్ లో ఉందా? ఆఫ్ఘనిస్తాన్ లో ఉందా? అంటూ ప్రశ్నించారు. సమావేశాలు పెట్టాలంటే మీ అనుమతి తీసుకోవాలా.. అంటూ బండి సంజయ్ తెలంగాణ సర్కారు తీరుపై మండిపడ్డారు.

 బీజేపీ పాలనపై విమర్శలు చేస్తూనే ప్రధానిని కలిసిన కేసీఆర్ దండాలు ఎందుకు పెడుతున్నారో?

బీజేపీ పాలనపై విమర్శలు చేస్తూనే ప్రధానిని కలిసిన కేసీఆర్ దండాలు ఎందుకు పెడుతున్నారో?

హైదరాబాద్లో ఎక్కడ చూసినా సీఎం, ఆయన కొడుకు ఫోటోలే కనిపిస్తున్నాయని, మంత్రులకు సిగ్గుగా అనిపించడం లేదా అంటూ మండిపడ్డారు. ప్రధాని మోడీ కి భయపడి ఈ తరహా చర్యలకు దిగారని విమర్శించారు. బీజేపీ ఎనిమిదేళ్లుగా ఏం చేయలేదు అని చెబుతున్న సీఎం కేసీఆర్, ప్రధానిని కలిసి దండాలు ఎందుకు పెట్టారో చెప్పాలని ప్రశ్నించారు. సాలు దొర సెలవు దొర అని తెలంగాణ ప్రజలు చెబుతున్నారని, వచ్చే ఎన్నికలలో తమ ఓటు ద్వారా కెసిఆర్ కు బుద్ధి చెప్పి తీరుతారని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.

English summary
Bandi Sanjay strongly reacted to Minister KTR's letter to PM Modi asking him to come to Telangana and learn. KTR .. you are giving us a lecture on welfare? Bandi Sanjay strong replied that your days are near
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X