బండి భగీరథ్ అరెస్ట్.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..
బండి భగీరథ్ పై పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బండి భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. చట్టంపై గౌరవంతో న్యాయవాదుల సమక్షంలో తన కుమారుడు బండి భగీరథ్ పై వచ్చిన ఆరోపణల దృష్ట్యా పేట్ బషీరాబాద్ పోలీసుల విచారణ కోసం అప్పగించానని ఈ మేరకు కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి ఉండాల్సిందేనని పేర్కొన్నారు. కాగా విచారణకు హాజరుకావాలని 3 రోజుల క్రితం ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
నిన్న విచారణకు వస్తానని చెప్పినా రాలేదు. దాంతో ఈరోజు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు మే 16 శనివారం రోజున మేడ్చల్ మేజిస్ట్రేట్ బాధితురాలు, ఆమె తల్లి వాంగ్మూలాలను నమోదు చేశారు. ఇప్పటికే బాధితురాలి వాంగ్మూలం పోలీసులు రెండుసార్లు నమోదు చేసిన విషయం తెలిసిందే. దాదాపు 40 నిమిషాల పాటు బాధితురాలు, ఆమె తల్లి వాంగ్మూలాలు సమర్పించారు.

ఇక బండి భగీరథ్ తన కుమార్తెను వేధిస్తున్నాడంటూ బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు ఈనెల 8న కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఆ మైనర్ బాలిక, ఆమె తల్లి నగదు కోసం తనను బెదిరిస్తున్నారంటూ బండి భగీరథ్ అదే రోజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు విషయంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ కేసు దర్యాప్తులో అలసత్వం వహించకుండా.. పారదర్శకంగా విచారణ జరపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications