వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇదీ చెక్కు వివాదం, తీవ్ర మనస్థాపం: వంశీపై పోరాటమేనన్న బండ్ల గణేష్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: చెల్లని చెక్కు వివాదంపై టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ స్పందించారు. చెల్లని చెక్కు కేసులో నిర్మాత బండ్ల గణేష్‌కు న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష, రూ.16 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. 'టెంపర్‌' సినిమాకు సంబంధించి చెల్లని చెక్కు ఇచ్చారని రచయిత వక్కంతం వంశీ ఫిర్యాదు చేశారు.

ఇదీ వివాదం

ఇదీ వివాదం

ఈ మేరకు విచారించిన ఎర్రమంజిల్‌లోని 14వ ప్రత్యేక మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ న్యాయస్థానం శుక్రవారం తీర్చు వెలువరించింది. ఈ తీర్పుపై సెషన్సు కోర్టుకు అప్పీలు చేసుకోవడం కోసం రూ.10 వేల పూచీకత్తు చెల్లించి షరతులతో కూడిన బెయిల్‌ను బండ్ల గణేష్‌ పొందారు. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించి బండ్ల గణేష్‌ సోషల్‌మీడియాలో పలు పోస్టులు పెట్టారు. ‘2015 ‘టెంపర్‌' చిత్రం వివాదం ఇది' అంటూ వరుస ట్వీట్లు చేశారు.

తీవ్ర మనస్తాపానికి గురయ్యా..

తీవ్ర మనస్తాపానికి గురయ్యా..

ఇంకా ‘కోటి నాలుగు లక్షల రూపాయలకు ‘టెంపర్‌' కథా హక్కులను రచయిత వంశీ నుంచి కొన్నాను. సినిమా సూపర్‌ హిట్‌ అయిన తరువాత హిందీ రీమేక్‌ హక్కులను దర్శక, నిర్మాత అయిన రోహిత్‌ శెట్టికి సంయుక్తంగా విక్రయించాం. కానీ, నాకు తెలియకుండా ‘టెంపర్‌' కథా హక్కులను రచయిత వంశీ మరొకరికి అమ్మారు. దీని వల్ల నేను తీవ్ర మనస్తాపానికి లోనై, విషయాన్ని సినీ ఛాంబర్‌ దృష్టికి తీసుకువెళ్లా. అదే సమయంలో ‘టెంపర్‌' చిత్ర కథకి ఇచ్చిన బ్యాలెన్స్‌ డబ్బుల చెక్‌ను నిలిపివేశాను' అని గణేష్ వివరించారు.

వంశీపై పోరాటం చేస్తా

వంశీపై పోరాటం చేస్తా

‘ఈ వివాదం ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఉన్నప్పటికీ వంశీ చెక్‌ను పట్టుకొని కోర్టుకి వెళ్లారు. నేను కొంత ఉపేక్షించటం వల్ల కోర్టు తీర్పు ఇచ్చింది. అది తెలిసిన నేను కోర్టు ద్వారా బెయిల్‌ పొందాను. ఈ విషయంపై ఉన్నత న్యాయ స్థానానికి అప్పీల్‌కు వెళ్తున్నాను. రచయిత వంశీపై న్యాయ పోరాటం సాగిస్తాను' అని గణేష్ తెలిపారు.

అర్థం చేసుకోండి..

అర్థం చేసుకోండి..

‘టెంపర్‌' సినిమాకు అద్భుతంగా మాటలు రాసి కథను విస్తృత పరిచిన శక్తి ఎవరో, ఏమిటో నాకు, నా సినిమా యూనిట్‌కు, సహాయ రచయితలకు, వంశీ మనస్సాక్షికి తెలుసు.. సినిమా రంగంలో నటులకు, దర్శకులకు, సాంకేతిక నిపుణులకు కోట్ల రూపాయలు చెల్లించిన నేను తొమ్మిది లక్షల రూపాయలు చెల్లించే స్థితిలో లేనా? నా అభిమానులు, ఆత్మీయులు అర్థం చేసుకోగలరు' అంటూ బండ్ల గణేష్‌ తన ట్వీట్లలో పేర్కొన్నారు.

English summary
Tollywood producer Bandla Ganesh responded on his cheque bounce case on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X