నిరంజన్ కు బండ్ల గణేష్ భారీ సాయం.. 'నా దేవుడు పవన్ కల్యాణ్ స్పూర్తితో'.. సంచలన ట్వీట్..

ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్.. ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే ఎంత అభిమానం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కల్యాణ్ ను దేవుడిగా ఆరాధిస్తారు బండ్ల గణేష్. సాధారణంగా హీరోలపై నిర్మాతలు అభిమానం చూపిస్తుంటారు. కానీ పవన్ కల్యాణ్ పై మాత్రం బండ్ల గణేష్ దైవ భక్తిని ప్రదర్శిస్తుంటారు. అవకాశం దొరికినప్పుడల్లా పవన్ కల్యాణ్ పై తన వీరభక్తిని చాటుతుంటారు బండ్ల గణేష్. తన కెరీర్ లో గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్‌ ను అందించి నిర్మాతగా తనను నిలబెట్టిన పవన్ అంటే అందుకే బండ్ల గణేష్ కు అంత అభిమానం. కేవలం సినిమాలే కాకుండా రాజకీయంగానూ పవన్ తీసుకునే ఏ నిర్ణయం అయినా బండ్ల గణేష్ సమర్థిస్తూంటారు.

అయితే తాజాగా పవన్ కల్యాణ్ వరంగల్ లో పర్యటించిన విషయం తెలిసిందే. తన అభిమాని నిరంజన్ చివరి కోరిక మేరకు ఆయన హన్మకొండలోని హనుమాన్ నగర్ లో ఉన్న బాలుడు నిరంజన్ ఇంటికి వచ్చారు. చాలా కాలంగా కాళ్లు పనిచేయక తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన అభిమానిని చూసి పవన్ చలించారు. బాలుడి తల్లిదండ్రులతో మాట్లాడి.. అతని ఆరోగ్య సమస్యలు, దాని చికిత్సపై వివరాలు తెలుసుకున్నారు.

BandlaGanesh Provides 5 Lakh Financial Assistance to Pawan Kalyan Fan Niranjan in Hanamkonda Bandla

అయితే నిరంజన్ ను పవన్ కల్యాణ్ కలిసిన నేపథ్యంలో నిర్మాత బండ్ల గణేష్ తన వంతు సాయం కూడా ప్రకటించారు. తీవ్రమైన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న నిరంజన్ కు తన వంతు సాయంగా రూ. 5 లక్షలు అందజేస్తున్నట్లు ప్రకటించారు. నా ఆరాధ్య దైవం పవన్ కల్యాణ్ స్ఫూర్తితో, పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ తరఫున నిరంజన్ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తున్నాను.. అని ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు బండ్ల గణేష్. అంతేకాక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను కలవగానే చాలా కాలంగా ఉన్న నిరంజన్ కోరిక నెరవేరబోతుండటం హృదయాన్ని కదిలించిందని తెలిపారు. ప్రస్తుతం బండ్ల గణేష్ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+