దేశంలో ఎక్కడెక్కడ ఎంతెంత?: బెంగళూరు ఇకపై 'కూల్ సిటీ' కాదా?

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా భానుడి ప్రతాపం కొనసాగుతోంది. వేసవి ప్రారంభం నుంచే దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఆదివారం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యాయి. ఎప్పుడూ తక్కువ ఉష్ణోగ్రతలతో చల్లగా ఉండే 'గార్డెన్ సిటీ' బెంగళూరుపై కూడా ఈ ఏడాది భానుడి ప్రభావం తీవ్రంగానే పడింది.

వర్షాలు సరైన సమయానికి పడకపోడవంతో బెంగుళూరు నగరం తన పూర్వ వైభవాన్ని కోల్పోతుంది. ఈ ఏడాది బెంగుళూరు నగరంలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. 85 ఏళ్ల తర్వాత బెంగుళూరు నగరంలో రికార్డు స్థాయి గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

ఏప్రిల్ 24 ఆదివారం నాడు బెంగుళూరు నగరంలో 39.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. సాధారణంగా ప్రతి ఏడాది ఎండాకాలంలో పోలిస్తే 5 డిగ్రీల ఉష్ణోగ్రత ఇందుకు తక్కువగా ఉంటుంది. అంటే ప్రతి ఏడాది వేసవిలో కేవలం 34 డిగ్రీలుగా ఉష్ణోగ్రత ఉండేది. దీంతో పెద్దగా ఎండ వేడిమి అనిపించేది కాదు.

Bangalore is ablaze at 39.2 degrees, breaks 85 year old record

కానీ ఈ ఏడాది మాత్రం 1931 తర్వాత ఇక్కడ నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత ఇదే కావడం విశేషం. 1931 మే 22న బెంగళూరులో 38.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఇది తక్కువే అయినప్పటికీ ఇదే రికార్డు ఉష్ణోగ్రతగా నమోదు కావడం విశేషం.

దీనిని బట్టి చూస్తుంటే ఇకపై వేసవిలో బెంగుళూరు కూడా ఏమంత నివసించతగ్గ ప్రాంతంగా అనిపించడం లేదు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో ఎండలు మండిపోతున్నాయి. కాగా ఆదివారం చిత్తూరు జిల్లా తిరుపతి, గుంటూరు జిల్లాలోని రెంటచింతలలో గరిష్టంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.

రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింతగా పెరిగే అవకాశం కూడా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కాగా అదివారం నాడు దేశంలోనే ఒడిశాలోని టిట్లాఘర్‌లో అత్యధికంగా 48.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ''2003 జూన్‌ 5న టిట్లాఘర్‌లో ఉష్ణోగ్రత 50 డిగ్రీలు దాటింది. 1999లో ఏప్రిల్‌ 30న అత్యధికంగా 48.1 డిగ్రీలు నమోదైంది'' అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

బిహార్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. పట్నాలో శనివారం 43.3 డిగ్రీలు నమోదవగా.. ఆదివారం 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దిల్లీలో కాస్త తక్కువగా 37.3 డిగ్రీలు నమోదైంది. పశ్చిమ్‌బంగలోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు అసోంలో వరదలకు నాలుగు జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+