పాతబస్తీ వేదికగా బండి సంజయ్ సంచలన ప్రకటన..!!

ఎంఐఎం పై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో ఎంఐఎం గోడమీది పిల్లిలాంటిదని, ఎవరు అధికారంలో ఉంటే వారి చెంతకు చేరుతుందని ఆరోపించారు. దమ్ముంటే అక్బరుద్దీన్‌ కొడంగల్‌ నుంచి పోటీచేయాలని, డిపాజిట్‌ కూడా రాకుండా చేస్తామన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి, ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ అన్నదమ్ములయ్యారన్నారు. భాగ్యలక్ష్మి ఆలయం గురించి బండి సంజయ్ అక్కడే కీలక ప్రకటన చేసారు.

బండి సంజయ్ పూజలు
పాతబస్తి లాల్‌దర్వాజ బోనాల సందర్భంగా చార్మినార్‌ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కొన్ని ప్రాంతాల్లో బోనాలను అడ్డుకుంటున్నారని, ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూడాలన్నారు. అమ్మవారి ఆశీస్సులతో అందరూ ఆనందంగా ఉండాలని కోరుకున్నానని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో రాగానే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని గోల్డెన్‌ టెంపుల్‌గా మారుస్తామని తెలిపారు. తాను హిందువుల తరపున పక్కా మాట్లాడుతానని, అయితే ఇతర మతాలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.

Bani Sanjay key announcement over Bahgyalakshmi Temple Targets MIM

ఎంఐఎం పై కామెంట్స్
బోనాల ఏర్పాట్లపై తన అసంతృప్తిని తెలిపారు. ఈ సందర్భంగా ఆ అమ్మవారిని సందర్శించి మొక్కుకుంటే మన కష్టాలన్నీ తొలగిపోతాయని..మహిమాన్వితమైన శక్తికి కలిగివున్న తల్లి అని..బోనాలలో ముక్కులు తీర్చుకుంటే మళ్లీ వచ్చే ఏడాది దాకా కష్టాలు మన దరిచేరవని అన్నారు. పాతబస్తీలో కొన్ని ప్రాంతాలలో బోనాలను అడ్డుకుంటున్నారని..దీని వెనక ఉన్న రాజకీయ శక్తులేమిటో తనకి తెలుసని అన్నారు. వాళ్లకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. అక్బరుద్దీన్ తన బలమేమిటో తెలియకుండా మాట్లాడుతున్నారని అన్నారు.

బంగారు ఆలయం చేస్తాం
అధికారంలోకి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి మద్దతు నిచ్చే పార్టీ ఎంఐఎం అన్నారు. ఎంఐఎం ఉండగా పాత బస్తీ ఎలాంటి అభివృద్ధికీ నోచుకోదని అన్నారు. రేవంత్ సర్కార్ బోనాల ఏర్పాట్ల కోసం కేవలం రూ.5 లక్షలు మాత్రమే నిధులు విదిల్చిందని అదే పాతబస్తీలో జరుపుకునే రంజాన్ పండుగకు మాత్రం రూ.33 కోట్లు ఎలా విడుదల చేశారని ప్రశ్నించారు. హిందూ, ముస్లిం పండుగల పేరుతో సీఎం రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ అధికారం లోకి వస్తే భాగ్యలక్హి ఆలయాన్ని బంగారు ఆలయంగా మారుస్తామని బండి హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+