పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్: పోలీసుల అదుపులో హరీశ్ రావు
హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy)పై బుధవారం కేసు నమోదు చేసిన పోలీసులు.. గురువారం అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో తమ విధులకు ఆటంకం కలిగించారంటూ సీఐ రాఘవేంద్ర ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డితోపాటు మరో 20 మంది ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం కొండాపూర్‌లోని కౌశిక్ రెడ్డి నివాసం వద్దకు భారీగా పోలీసులు చేరుకుని అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ పోలస్ స్టేషన్‌కు తరలించారు. కౌశిక్ రెడ్డిపై బీఎన్ఎస్ 57, 126(2), 132, 224, 333, 451(3), 191(2), r/w 190, r/w3(5) సెక్షన్ల కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనను కోర్టుకు తరలించేందుకు సిద్ధమవుతున్నవారు.

మరోవైపు, కౌశిక్ రెడ్డి తరపు లాయర్లు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోగా.. పోలీసులు వారిని లోపలికి అనుమతించలేదు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేయడం ఏంటని పోలీసులతో న్యాయవాదులు వాగ్వాగానికి దిగారు. ఇది ఇలావుండగా, కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే సమాచారంతో అంతకుముందే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు.
BRS MLA Harish Rao arrested when he went to the residence of Padi Kaushik Reddy following a case against the latter. pic.twitter.com/cTBDeJ5rOb
— Naveena (@TheNaveena) December 5, 2024
మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డితోపాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కౌశిక్ రెడ్డి ఇంట్లోకి వెళ్లేందుకు హరీశ్ రావు ప్రయత్నించగా.. పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఇంటి గేట్లు దూకేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపారు.
అక్రమ అరెస్ట్ pic.twitter.com/jJ4QK8CWIC
— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) December 5, 2024
ఆ తర్వాత హరీశ్ రావును గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడ్నుంచి తరలించారు. అయితే, హరీశ్ రావును తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకునేందుకు కార్యకర్తలు యత్నించారు. ఆ తర్వాత కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.












Click it and Unblock the Notifications