Telangana: సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. కోటి అందించిన బ్యాంక్ ఆఫ్ బరోడా..
కొద్ది రోజుల క్రితం తెలంగాణ కురిసిన భారీ వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో భారీ నష్టం సంభవించింది. ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. అటు ఏపీలో కూడా భారీ వర్షాలతో ప్రజలు నష్టపోయారు. ఈ నేపథ్యంలోనే పారిశ్రామికవేత్తలు, టాలీవుడ్ ప్రముఖులు విరాళాలు ప్రకటించారు. తెలంగాణతో పాటు ఏపీకి కూడా విరాళాలు ప్రకటించారు. ఆ తర్వాత ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల వద్దకు వెళ్లి చెక్కులు అందిస్తున్నారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. కోటి అందించింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ రితేష్ కుమార్, డీజీఎం ఎంవీఎస్ సుధాకర్ గురువారం జూబ్లీహిల్స్ లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కోటి రూపాయల చెక్కును అందించారు. కొద్ది రోజుల క్రితం లార్సెన్ అండ్ టూబ్రో(L&T) సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీ మొత్తంగా విరాళం అందించింది. కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రూ.5.5 కోట్లు అందించారు. మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు రామ్ చరణ్ కలిసి ఇరు రాష్ట్రాలకు రూ.కోటి చొప్పున విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.

మెగాస్టార్ చిరంజీవి ఇరు రాష్ట్రాల సీఎంలను కలిసి చెక్కులు కూడా అందించారు. అంతకు ముందు హీరో బాలకృష్ణ చిన్న కూతురు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రూ.50 లక్షల చెక్ ఇచ్చారు. మహేశ్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్ ఇలా చాలా మంది సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందించారు. ప్రజలను ఆదుకునేందుకు పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు ముందుకు రావడం గొప్ప విషయమని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు వరద సాయం ప్రకటించింది.
వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి బ్యాంక్ ఆఫ్ బరోడా 1కోటి రూపాయల విరాళం అందించింది. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి @revanth_anumula గారిని కలిసిన @bankofbaroda జనరల్ మేనేజర్ రితేశ్ కుమార్ గారు, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎంవీఎస్ సుధాకర్ గారు ఈ మేరకు విరాళం చెక్కును… pic.twitter.com/sjDIG9zDeC
— Telangana CMO (@TelanganaCMO) October 24, 2024
స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ పండ్ అడ్వాన్స్ కింద 14 రాష్ట్రాలకు వరద సహాయం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ కు రూ.1,036 కోట్లు ఇవ్వగా.. తెలంగాణకు రూ.416.80 కోట్లు ఇచ్చారు. అత్యధికంగా మహారాష్ట్రకు నిధులు మంజూరు చేశారు.












Click it and Unblock the Notifications