బ్యాంకులకు వరుసగా 4 రోజులు సెలవు, ఏటీఎంలలో డబ్బు నిండుకోవచ్చు!

హైదరాబాద్: బ్యాంకింగ్ సెక్టార్‌కు వరుస సెలవులు వస్తున్నాయి. మార్చి 24వ తేదీ నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో డబ్బులు కావాలన్నా, బ్యాంకులలో ఏదైనా పని ఉన్నా ఈ లోగానే పూర్తి చేసుకోవాల్సి ఉంది.

వచ్చే గురువారం నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులకు సెలవు. మార్చి 24వ తేదీ గురువారం నాడు హోలీ పండుగ ఉంది. 25వ తేదీ శుక్రవారం నాడు గుడ్ ఫ్రైడే ఉంది. ఆ తర్వాత.. నాలుగో శనివారం, ఆదివారం వస్తున్నాయి. రెండు, నాలుగో శనివారాలు బ్యాంకులకు సెలవు దినాలు.

Banks to remain closed for 4 straight days; ATMs likely to run out of cash

భారత్‌లోని అత్యధిక రాష్ట్రాలలో ఈ నాలుగు రోజుల పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ బ్యాంకుల ఏటీఎంలలో 23వ తేదీ బుధవారం సాయంత్రం అనంతరం.. తిరిగి సోమవారం మాత్రమే నగదు నింపే అవకాశాలున్నాయి.

సాధారణంగా ప్రధాన ప్రాంతాలలోని ఏటీఎంలలో రెండు మూడు రోజుల్లో నగదు అయిపోతుంది. ఇప్పుడు వరుసగా నాలుగు రోజులు సెలవులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఏటీఎంలలో డబ్బులు ఖాళీ అయిపోయే అవకాశముంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+