బ్యాంకులకు వరుస సెలవులు, లిస్టు ఇదే..!!
బ్యాంకు వినియోగ దారులకు బిగ్ అలర్ట్. బ్యాంకులకు వరుస సెలవులు రానున్నాయి. ఇప్పటికే 2026 సంవత్సరానికి సంబంధించిన బ్యాంకుల సెలవుల జాబితాను ప్రకటించారు. కాగా, ఈ నెల లో క్రిస్మస్ సెలవుల తరువాత జనవరి మాసంలో బ్యాంకులకు దాదాపు 15 రోజులు సెలవులు రానున్నాయి. సంక్రాంతికి ప్రత్యేకంగా ఈ సారి సెలవుల పైన నిర్ణయం తీసుకున్నారు. కస్టమర్ల కు ఈ మేరకు బ్యాంకులు ముందస్తుగా అప్రమత్తం చేస్తున్నాయి.
మరి కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. 2026 లో బ్యాంకుల సెలవుల జాబితా ను ఇప్పటికే ప్రకటించారు. కాగా..వచ్చే నెల జనవరికి సంబంధించి వరుస సెలవులు రానున్నాయి. ఈ మేరకు లిస్టు ఖరారు చేసారు. సంక్రాంతి, జనవరి 26 తో పాటుగా మరిన్ని సెలవులు కలిపి జనవరి నెలలో బ్యాంకులకు దాదాపు 15 రోజులు సెలవులు రానున్నాయి. రాష్ట్రాలు.. అక్కడి ప్రాధాన్యత ల ఆధారంగా సెలవుల జాబితా ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో జనవరికి సంబంధిం చిన సెలవు ల లిస్టును అధికారికంగా వెల్లడించారు. ఇందులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్ణయించిన జాతీయ, రాష్ట్రీయ పండుగలు, వీకెండ్స్ (రెండు, నాలుగవ శనివారాలు, ఇంకా సండేలు) ఉన్నాయి.

కాగా, బ్యాంకులకు సెలవులు ఉన్నా వినియోగ దారులకు ఆన్‌లైన్ బ్యాంకింగ్, UPI, NEFT వంటివి ఎప్పుడూ అందుబాటులో ఉంటాయని అధికారులు స్పష్టం చేసారు. జనవరి 1: న్యూ ఇయర్ డే, జనవరి 2: న్యూ ఇయర్ సెలబ్రేషన్ / మన్నం జయంతి, జనవరి 12: స్వామి వివేకానంద జయంతి, జనవరి 14: మకర సంక్రాంతి / మాఘ బిహు, జనవరి 15: ఉత్తరాయణ పుణ్యకాలం / పొంగల్ / మాఘే సంక్రాంతి, జనవరి 16: తిరువళ్లువర్ డే (ప్రధానంగా తమిళనాడులో), జనవరి 17: ఉజవర్ తిరునాళ్, జనవరి 23: నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి / సరస్వతీ పూజ / బసంత పంచమి, జనవరి 26: రిపబ్లిక్ డే (జాతీయ హాలిడే - అన్ని రాష్ట్రాలు), ఇవికాక, వీకెండ్స్ (శని, ఆదివారాలు) సెలవులు గా ఉండనున్నాయి. దీంతో.. వినియోగ దారులు ముందస్తుగానే తమ సర్వీసులకు అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications