సెప్టెంబర్​ లో బ్యాంకులకు భారీగా సెలవులు, సమ్మె- లిస్టు..!!

బ్యాంకు వినియోగదారులకు బిగ్ అలర్ట్. సెప్టెంబర్ మాసంలో బ్యాంకులకు పెద్ద సంఖ్యలో సెలవు లు ఉన్నాయి. అదే విధంగా తమ డిమాండ్ల సాధన కోసం బ్యాంకు సంఘాలు సమ్మెకు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో, వినియోగదారులకు ఆర్బీఐ ముందస్తు సూచనలు చేస్తోంది. దాదాపు 16 రోజుల పాటు బ్యాంకుల సేవలు ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో.. బ్యాంకు వినియోగదారులు తమ కార్యకలాపాలను ముందస్తుగానే చేసుకోవాలని సూచిస్తున్నారు.

సెప్టెంబర్ లో బ్యాంకులకు సెలవులు చాలా రోజులు రానున్నాయి. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం పండుగలు ఆదివారాలు రెండవ నాలుగవ శనివారాలు కలిసి మొత్తం పదహారు రోజులు బ్యాంకు లు బంద్ కానున్నాయి. తెలుగు రాష్ట్రాలలో కృష్ణాష్టమి, వినాయక చవితి పండుగలు రావడం వలన సేవలు నిలిచిపోనున్నాయి. నెలాఖరులో ఉద్యోగుల సమ్మె కారణంగా లావాదేవీలకు తీవ్రమైన అంతరాయం కలగనుంది. సెప్టెంబర్ నెల ప్రారంభం నుండి చివరకు వివిధ రకాల పండుగలు వారాంతపు సెలవులు వరుసగా వస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణాష్టమి రోజున కొన్ని ప్రాంతాలలో బ్యాంకులు పనిచేయవు. వినాయక చవితి పండుగ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో సెలవు ఉంటుంది. రెండవ శనివారం నాల్గవ శనివారం అలాగే ప్రతి ఆదివారం సాధారణ సెలవులు వర్తిస్తాయి.

 ఇంటి వద్దే ప్రయాణీకుల పికప్, ఆర్టీసీ కొత్త సదుపాయం - ఈ సర్వీసుల్లోనే... వీరికే..!!
ఇంటి వద్దే ప్రయాణీకుల పికప్, ఆర్టీసీ కొత్త సదుపాయం - ఈ సర్వీసుల్లోనే... వీరికే..!!
banks-to-remain-closed-on-several-days-in-september-2026-check-rbi-holiday-calendar-here-the-ist

డిమాండ్ల సాధన కోసం యూనియన్ల సమ్మె

నెల చివరి రోజులలో ఉద్యోగుల సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మె కారణం గా ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఆన్ లైన్ సేవలు యూపీఐ లావాదేవీలు యథావిధిగా కొనసాగుతాయి. బ్యాంకు శాఖలకు నేరుగా వెళ్లేవారు సెలవుల జాబితాను ముందుగా నే పరిశీలించి పనులు పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. వారానికి 5 రోజుల బ్యాంకింగ్ నిబంధనను తక్షణమే అమల్లోకి తేవడం, సీనియర్ అధికారులకు ప్రవేశపెట్టిన సవరించిన పీఎల్ఐ పథకాన్ని ఉపసంహరించుకోవాలనే ప్రధాన డిమాండ్లతో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమ్మెకు పిలుపునిచ్చింది. దీని పైన చర్చలకు యంత్రాగం సిద్దం అవుతోంది. ఒక వేళ యూనియన్లతో చర్చలు విఫలమై సమ్మె ముందుకెళ్తే, నెలాఖరులో బ్యాంకింగ్ వ్యవస్థ స్తంభించే అవకాశం ఉంది. సెప్టెంబర్ 26 (రెండో శనివారం), సెప్టెంబర్ 27 (ఆదివారం), ఆపై సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో సమ్మె కారణంగా వరుసగా 5 రోజుల పాటు బ్యాంకింగ్ లావాదేవీ లకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+