మరో గుడ్ న్యూస్ చెప్పిన బర్రెలక్క
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారిపోయింది. ఈ ఎన్నికల్లో రాజకీయ నాయకుల కన్నా బర్రెలక్కనే ఎక్కువ ఫేమస్ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి..రెండు తెలుగు రాష్ట్రాల్లో మరింత గుర్తింపు తెచ్చుకుంది. దీంతో సోషల్ మీడియాలో బర్రెలక్క పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. ఆమె కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 5754 ఓట్ల సాధించి ఆమె నాలుగో స్థానంలో నిలిచింది.
ఈ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ బర్రెలక్క చాలామందికి ఆదర్శంగా నిలిచింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తాను పోటీ చేస్తానని బర్రెలక్క ప్రకటించింది. బర్రెలక్కను చూపిస్తూ ఏపీ సీఎం జగన్ సైతం పవన్ కల్యాణ్ మీద విమర్శలు చేశారు. బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా జనసేనకు రాలేదని సీఎం జగన్ ఎద్దెవా చేశారు. ఇదిలా ఉంటే..తాజాగా ఆమె పెళ్లికి సిద్ధమైంది. తాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆమె తెలిపారు. ఇక పెళ్లి కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

అలానే పెళ్లి కోసం చేసిన షాపింగ్ ఫోటోలను కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేసింది. పెళ్లి మ్యాటర్ చెప్పిన ఆమె.. కాబోయే భర్త గురించి మాత్రం రివిల్ చేయలేదు. బర్రెలక్కకు గతంలో పెళ్లి జరగ్గా..పలు కారణాలతో అతడి నుంచి విడిపోయింది. ఇప్పుడు ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుంది. గతంలో జరిగిన అనుభవాల కారణంగా కాబోయే భర్త గురించి బర్రెలక్క చెప్పడం లేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
గతంలో ఆమె వివాహం గురించి అనేక వార్తలు ప్రచారం అయ్యాయి. ఇటీవల బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్టు వచ్చిన వార్తలను ఆమె ఖండించారు. ప్రశాంత్ తనకు అన్నయ్య లాంటివాడని చెప్పడంలో ఈ ప్రచారానికి తెర పడింది. మొత్తానికి బర్రెలక్క పెళ్లిపీటల ఎక్కబోతుండటంతో ఆమె అభిమానులు సంతోష పడుతున్నారు.












Click it and Unblock the Notifications