ఏపీ వాళ్లొస్తామంటేనే ముంబైకి, కేంద్రమంత్రి వట్టిదే: అత్తారింట్లో కవిత (పిక్చర్స్)

నిజామాబాద్/కరీంనగర్: తనకు కేంద్రమంత్రి పదవి అనేది దుష్ప్రచారమని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత బుధవారం నాడు చెప్పారు. ఆ దిశగా తాము ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదన్నారు. కరవు, తెలంగాణలోని ఇతర సమస్యల పైన తాము కేంద్రమంత్రులను కలుస్తున్నట్లు చెప్పారు.

దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి సన్నబియ్యంగా మార్చుతున్నారన్న ప్రతిపక్షాల ఆరోపణలు అవాస్తవమన్నారు. హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యాన్నే సరఫరా చేస్తున్నామన్నారు. సన్న బియ్యం విషయంలో ఎటువంటి పొరపాట్లు లేవన్నారు. అయినా విమర్శల నేపథ్యంలో పరిశీలిస్తామన్నారు.

బతుకమ్మ ఉత్సవాలపై మాట్లాడుతూ... ముంబైలో రెండు రాష్ట్రాలకు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) చెందిన తెలుగు వారు పది లక్షల మంది ఉన్నారని, వారంతా కలిసి బతుకమ్మ ఆడితేనే తాను వస్తానని చెప్పడంతో వారు అంగీకరించారని కవిత చెప్పారు. వారి విజ్ఞప్తి మేరకు ఈ ఏడాది అక్కడ బతుకమ్మ నిర్వహణకు అంగీకరించామన్నారు.

కవిత

కవిత

కోటి బతుకమ్మలు ఎత్తామని, కొత్త తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని, బంగారు బతుకమ్మ ఎత్తామని, బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధిద్దామని కవిత పిలుపునిచ్చారు. ఆడబిడ్డల భవిష్యత్ బాగుండాలన్నారు. దేశం మొత్తంలో నూటికి నూరు శాతం చదువుకున్నటువంటి ఆడపిల్లలు ఎక్కడ ఉన్నారంటే తెలంగాణలోనే అన్నారు.

కవిత

కవిత

అనేవిధంగా మనం పేరు తెచ్చుకోవాలన్నారు. పాఠశాలల్లో మూత్రశాలలు లేకపోవడంతో ఆడపిల్లలు చదువు మానేసిన సందర్భాలు ఉన్నాయని, ఆడపిల్లలను ఖర్చు తగ్గించుకోవడానికి సర్కారు పాఠశాలలకు పంపిస్తున్నారన్నారు. మగ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారన్నారు.

కవిత

కవిత

సర్కారు బడి అంటే వసతులు లేకుండా ఉండకూడదని, సీఎం కేసీఆర్ పాలనలో సర్కారు బడులు అద్భుతంగా తయారవుతాయని, ఇకమీదట ఆడపిల్లల చదువులపై నిర్లక్ష్యం వద్దని, తప్పకుండా బడికి పంపించాలన్నారు. ఆడపిల్లలకు బాల్య వివాహాలు మానుకోవాలన్నారు.

కవిత

కవిత

50 శాతం ఉన్న మహిళలు అభివృద్ధి చెందితేనే బంగారు తెలంగాణ సాధ్యం అవుతుందని కవిత పేర్కొన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఆమె మాట్లాడారు. అనంతరం కరీంనగర్ జిల్లాలోను మాట్లాడారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.

కవిత

కవిత

కవిత ఇంకా మాట్లాడుతూ.. నా అత్తగారి ఊరైన నిజామాబాద్‌ జిల్లాలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొని ఆడుతున్నందుకు ఎంతో గర్వపడుతున్నట్లు చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మహిళలమంతా నాడు బతుకమ్మలను ఎత్తి తెలంగాణ సాధించుకున్నామన్నారు. నేడు బంగారు తెలంగాణ కోసం బతుకమ్మలు ఎత్తుదామన్నారు. బతుకమ్మ సాక్షిగా మనమంతా ఆడపిల్లల్ని చదివించుకుందామని ప్రతినబూనుదామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+