సచివాలయంలో ఆనందోత్సహాలతో బతుకమ్మ
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ పండుగను ఆనందోత్సహాలతో జరుపుకుంటున్నారు. రంగు రంగు పూలతో పేర్చిన బతుకమ్మ చుట్టూ తిరుగుతూ బతుకుమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అని ఆడుతూ పాడుతు ఘనంగా సంబురాలను జరుపుకుంటున్నారు. ఈమేరకు గురువారం సచివాలయంలో ఆవరణలో బతుకమ్మ సంబురాలను ఉద్యోగినులు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు గొప్ప ఆదరణ ఉందని, కుల మతాలకు అతీతంగా రాష్ట్రంలోని ప్రజలంతా కలిసి జరుపుకునే ఉత్సవం బతుకమ్మ ఉత్సవం అని వారు తెలిపారు.












Click it and Unblock the Notifications