బతుకమ్మ ఊరేగింపు: కవిత, పద్మా దేవేందర్ రెడ్డి పూజలు
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ ఉత్సవాల ముగింపు వేడుకలు హైదరాబాదులోని ఎల్బీస్టేడియం నుంచి మంగళవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి బతుకమ్మతో ఎల్బీస్టేడియంకు చేరుకుని అక్కడ పూజలు నిర్వహించారు.
ఆ తర్వాత మహిళలతో కలిసి బతుకమ్మను ఎత్తుకుని ఎల్బీ స్టేడియం నుంచి ర్యాలీగా బయలుదేరారు. బతుకమ్మల ర్యాలీ ఎల్బీ స్గేడియం నుంచి బషీర్ బాగ్, లిబర్టీ మీదుగా ట్యాంక్ బండ్ చేరుకుంది. వేలాది మంది బతుకమ్మలు ఎత్తుకుని చేస్తున్న ర్యాలీతో భాగ్యనగరమంతా పూల వనంలా విలసిల్లింది.

సద్దుల బతుకమ్మను ఘనంగా జరపడానికి ట్యాంక్‌బండ్‌పై ఏర్పాట్లు జరిగాయి. బతుకమ్మ ఆటపాటలతో ట్యాంక్‌బండ్ పరిసరాలు సందడిగా మారాయి. విద్యుత్తు కాంతులతో ట్యాంక్‌బండ్ ధగధగలాడుతోంది. వేలాది మంది మహిళలు, కళాకారులు ఊరేగింపులో పాల్గొన్నారు.
బతుకమ్మ ఉత్సవాలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications