ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో బతుకమ్మ
హైదరాబాద్: హైదరాబాదులోని తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో బతుకమ్మ ఆడి అలరించారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత బతుకమ్మ వేడుకల్లో పాల్గొని, పాడారు. కవితతో పాటు కేసీఆర్ భార్య, కోడలు కూడా పాల్గొన్నారు. మరోవైపు, పోలీస్ అధికారులు డిజిపి కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బతుకమ్మ నిదర్శనం అన్నారు. వచ్చే ఏడాది మరింత ఘనంగా నిర్వహిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications