శిరీష మృతి, రాజీవ్ రాసలీలలు: శ్రవణ్-రాజీవ్‌ల విచారణకు ఓకే
బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో రాజీవ్, శ్రవణ్‌లను అయిదు రోజుల కస్టడీకి అప్పగించాలని పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో రాజీవ్, శ్రవణ్‌లను అయిదు రోజుల కస్టడీకి అప్పగించాలని పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

విచారించి...
ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు రాజీవ్, శ్రవణ్‌లను రెండు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఈ నెల 26, 27 తేదీల్లో వీరిని కస్టడీలోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీసులు విచారిస్తారు.

అనుమానాల నివృత్తి కోసం..
గతంలో రాజీవ్, శ్రవణ్‌లను అయిదు రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈ కేసులో అనుమానాల నివృత్తి కోసం రెండు రోజులు వారిని పోలీసుల కస్టడీకి అప్పగించింది.

రాజీవ్‌పై రాసలీలల అనుమానాలు
కాగా, శిరీష మృతి కేసు అనంతరం రాజీవ్, శ్రవణ్‌ల గురించి షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. రాజీవ్ నాలుగైదు నెలలకు ఓసారి అమ్మాయిని మార్చేవాడని, తనతో సన్నిహితంగా ఉండే యువతులకు తెలియకుండా వీడియోలు చిత్రీకరించేవాడని వాదనలు వినిపించాయి. శిరీషకు ముందు కూడా రాజీవ్ మరికొందరిని మోసం చేశాడని అంటున్నారు.

వాడుకొని వదిలేసేవాడని..
శిరీషను వదిలించుకునేందుకు రాజీవ్.. తేజస్వినిని ఉపయోగించుకునే ప్రయత్నం చేశాడని, ఆ తర్వాత తేజస్వినిని కూడా వదిలించుకోవాలని భావించాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో శిరీష ఆత్మహత్యకు గల కారణాలను, కుకునూరుపల్లి ఎస్సై ఆత్మహత్యతో గల సంబంధాలను పోలీసులు వారి నుంచి రాబట్టే ప్రయత్నం చేయనున్నారని తెలుస్తోంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications