ట్విస్ట్.. రాజీవ్‌ను ఏమైనా అంటే చంపేస్తా: శిరీష, ఎస్సైతో ఉండాలని ఒత్తిడి?

బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. శిరీషకు చెందిన రెండో ఆడియో టేప్ కూడా సంచలనం రేపుతోంది.

హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. శిరీషకు చెందిన రెండో ఆడియో టేప్ కూడా సంచలనం రేపుతోంది. ఆ టేప్‌లో రాజీవ్ అంటే తనకు ప్రాణమని, ఆయనను ఎవరైనా ఏమైనా చేస్తే చంపేస్తానని చెప్పినట్లుగా ఉంది.

శిరీష రెండో టేప్ అంటూ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఆ రెండో ఆడియో టేప్‌లో శిరీష.. నవీన్‌తో మాట్లాడింది. రాజీవ్‌కు తనకు మధ్య సన్నిహిత సంబంధం ఉన్నట్లు ఆమె అందులో పేర్కొంది.

ఎవరైనా ఏమైనా అంటే చంపేస్తా

ఎవరైనా ఏమైనా అంటే చంపేస్తా

రాజీవ్ అంటే తనకు ప్రాణమని, ఆయనను ఎవరైనా ఏమైనా అంటే చంపేస్తానని శిరీష అని చెప్పినట్లుగా ఆడియోలో ఉంది. తనను, రాజీవ్‌ను ఎవరూ విడదీయలేరని శిరీష రెండో ఆడియో టేప్‌లో పేర్కొంది. రాజేష్‌కు ఏ ప్రమాదం జరిగినా తాను ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పింది. తద్వారా రాజీవ్‌కు శిరీషకు మధ్య సాన్నిహిత్యం ఉందని మరోసారి వెలుగు చూసింది.

తేజస్వినితో రాజీవ్‌కు సంబంధం లేకుండా చూడండి

తేజస్వినితో రాజీవ్‌కు సంబంధం లేకుండా చూడండి

రాజీవ్, తేజస్వినిల మధ్య ఎలాంటి సంబంధం లేకుండా చూడాలని శిరీష.. నవీన్‌కు చెప్పిందని తెలుస్తోంది. తమ మధ్య తేజస్విని రాకుండా చూడాలని ఆమె కోరిందని సమాచారం. తేజస్విని పరిచయం అయ్యాకనే రాజీవ్.. శిరీషను దూరం పెట్టారనే విషయం తెలిసిందే. తేజస్విని పెళ్లి చేసుకునేందుకు రాజీవ్.. శిరీషను దూరం పెట్టాడు.

శిరీష మృతి వెనుక బలమైన కారణాలు

శిరీష మృతి వెనుక బలమైన కారణాలు

శిరీష ఆత్మహత్య చేసుకున్నదని పోలీసులు తేల్చారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకున్నప్పటికీ దాని వెనుక బలమైన కారణాలు ఉండి ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే, ఆమెపై అత్యాచారం చేసి, చంపేశారా అనే చర్చ కూడా సాగుతోంది. ఎందుకంటే ఆమె దుస్తుల పైన రక్తపు మరకలు ఉన్నాయి. దీంతో హత్య కోణంలో అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఎస్సైతో ఉండేందుకు ఒత్తిడి తెచ్చారా

ఎస్సైతో ఉండేందుకు ఒత్తిడి తెచ్చారా

రాజీవ్ - శిరీష - తేజస్విని మధ్య గొడవ నేపథ్యంలో ఎస్సై ప్రభాకర్ రెడ్డి వద్దకు వెళ్లారు. ఆ సమయంలో శిరీషను బలవంతంగా ఎస్సై వద్దకు పంపించే ప్రయత్నం చేశారా అనే కోణంలో అనుమానాలు కలుగుతున్నాయి. రాజీవ్ సహకారంతో ఎస్సైతో ఉండాలని శ్రవణ్ ఒత్తిడి చేశారా అనే కోణంలోను దర్యాఫ్తు చేస్తున్నారని తెలుస్తోంది.

శిరీష ఇతరులతోనూ క్లోజ్‌గా..?

శిరీష ఇతరులతోనూ క్లోజ్‌గా..?

బ్యూటీషియన్ శిరీష ఇతరులతోనూ సన్నిహితంగా ఉండేవారా? అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయని అంటున్నారు. వీడియోలో నవీన్‌ను డార్లింగ్ అని సంభోదించడం, మాట తీరు చూస్తుంటే వారితోను సన్నిహితంగా ఉండేవారనే అనుమానాలు కలుగుతున్నాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+