వందల ఆడియో టేప్‌లు, ఎన్నో అనుమానాలు: లీకైన టేప్‌లో శిరీష ఇలా..
బ్యూటీషియన్ శిరీష రెండో ఆడియో టేప్ కలకలం సృష్టిస్తోంది. ఆమె తేజస్విని గురించి నందు, నవీన్‌లతో మాట్లాడింది. రాజీవ్‌కు, తనకు మధ్య తేజస్విని రాకుండా చూడాలని వారిని ఈమె కోరింది.
హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష రెండో ఆడియో టేప్ కలకలం సృష్టిస్తోంది. ఆమె తేజస్విని గురించి నందు, నవీన్‌లతో మాట్లాడింది. రాజీవ్‌కు, తనకు మధ్య తేజస్విని రాకుండా చూడాలని వారిని ఈమె కోరింది. శిరీష ఆత్మహత్య కేసులో రోజుకో కోణం వెలుగు చూస్తోంది.
శిరీష దుస్తులపై రక్తపు మరకలు ఉండటంతో అత్యాచారం జరిగి ఉంటుందా అనే అనుమానాలు కూడా ఇటీవల వ్యక్తమైన విషయం తెలిసిందే. ఇప్పుడు తనకు, రాజీవ్‌కు మధ్య తేజస్విని రాకుండా చూడాలని నందు, నవీన్‌లను ఆమె కోరింది.
శిరీషను నందు బాగా తిడుతూ.. రాజీవ్‌ను వాడు అని సంబోధించాడు. దానికి వాడు ఏమిటి అని శిరీష అతనిని హెచ్చరించింది. నవీన్, నందులతో శిరీష మాట్లాడిన రెండో టేప్ అంటూ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ సంభాషణలు ఎవరు లీక్ చేశారో తెలియాల్సి ఉంది.
మరోవైపు, ఆడియోల లీక్ నేపథ్యంలో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఆడియోలను ఫోరెన్సిక్‌కు పంపించారు. శిరీష ఫోన్లో వందల ఆడియో టేప్‌లు ఉండటంతో ఆడియో టేపుల ఆధారంగా పోలీసులు విచారణ జరపనున్నారు.

తేజస్విని ఇష్టం వచ్చినట్లు చేస్తుందమో..
శిరీష: వాడు ప్రతీ కాల్ రికార్డ్ చేస్తున్నాడు
నవీన్: నువ్వు లైన్‌లో ఉండు. నేను వాడికి ఫోన్ చేస్తా. నువ్వు కామ్‌గా ఉండు.
శిరీష: మళ్లీ కెలికితే తేజస్విని ఫైర్ అయిపోయి ఇష్టం వచ్చినట్లు చేస్తుందేమో. కేసులు పెడుతుందేమో.
నవీన్: ఏమి కాదు. నేను ఉన్నానుగా. నందు ఉన్నాడు.. నేను ఉన్నా. హైదరాబాద్‌లో తోపులం మనం.
శిరీష: అసలు ఏం జరుగుతున్నా నామీద ఫైర్ అవుతోంది.
నవీన్: నువ్వు మామూలుగా విను. దాన్ని లైన్‌లో కలుపుతా. నందూనే మాట్లాడుతాడు ఓకేనా.
శిరీష: ఏ వద్దు.. ఇక వదిలేయండి. అనవసరంగా రిస్క్ ఎందుకు?

నువ్వెంత, నీ బతుకెంత
ఇంకా..
నవీన్: హే.. ఏమి లేదులే. వాడిచ్చాడే మాట్లాడాడు. మనిద్దరం మాట్లాడడానికే ముందే మాట్లాడి పెట్టేశాడు.
శిరీష: ఏమని మాట్లాడాడు.
నవీన్: నువ్వెంత, నీ బతుకెంత అని నందు దాన్ని తిట్టాడు.
శిరీష: అయితే నువ్వు ఏం మాట్లాడావు.
నవీన్: నందు మాట్లాడుతుంటే నువ్వు అనుకొని మాట్లాడాను.

ఏమని తిట్టావురా..
ఇంకా..
శిరీష: హలో
నందు: హలో.. శిరీష చెప్పు
శిరీష: ఏమని తిట్టావురా దాన్ని.
నందు: నీ ఇళ్లు.. (బూతులు తిట్టినట్లు చెప్పాడు)
శిరీష: నా నెంబర్ ఎలా వచ్చిందని అడిగిందా..

ఎవడు తెలుసట దానికి..
నందు: ఏమి మాట్లాడలేదు. విజయవాడలో నాకు వాడు తెలుసు, వీడు తెలుసు అన్నది.
శిరీష: ఎవడు తెలుసంటా.. ఏమంటోంది. నెంబర్ అడిగితే చంపిస్తా అని బెదిరిస్తుందా..
ఏమంటోంది అది.
నందు: ఎవరిని నన్నా.. నేను దాన్ని తిట్టాను.
నవీన్: ఇంకోసారి నీకు కాల్ చేయదు ఓకేనా..
శిరీష: రాజీవ్‌కు, నాకు ఇద్దరికి కాల్ చెయ్యదుగా..

పాపం రాజీవ్‌ను ఇన్వాల్వ్ చేయకు..
నవీన్: ఒకసారి రాజీవ్‌ను నాకు కాల్ చేయమని చెప్పు.
శిరీష: ఎందుకు పాపం.. తనను ఇన్వాల్వ్ చేయడం
నవీన్: ఓసారి వాన్ని కాల్ చేయమని చెప్పవే.. వాణ్ణి
శిరీష: ఆడంటావేంట్రా.. చంపేస్తా..
నవీన్: మనోడేగా.. విజయవాడ కుర్రోడుగా..
శిరీష: మనోడైతే రాజీవ్ అనొచ్చుగా.. సరే, మా ఇద్దరి జోలికి రాకుండా చూసుకుంటావుగా..
నవీన్: ఏంటి
శిరీష: మా ఇద్దరి జోలికి వస్తే నేను నిన్నే అడుగుతా..
నవీన్: సరే.. సరే..












Click it and Unblock the Notifications