శిరీషను 'వ్యభిచారిణి'గా చిత్రీకరించాలనుకున్నారా?: రాజీవ్ ఫోన్‌లో వెయ్యి కాల్ రికార్డింగ్స్!
అటు శ్రవణ్ మొబైల్ లోను పలు అసభ్యకర చిత్రాలను పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. వీటిని బట్టి చూస్తే.. శిరీషను వారు ఉద్దేశపూర్వకంగానే ఏమార్చారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్: బ్యుటీషియన్ శిరీష అనుమానాస్పద మృతి కేసు రోజుకో ములుపు తిరుగుతోంది. రిమాండ్ రిపోర్టు నుంచి వెలువడుతున్న సంచలన విషయాలు కేసును ఏ మలుపు తిప్పబోతున్నాయోనన్న ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. రిమాండ్ రిపోర్టులో శిరీష లోదుస్తులపై మరకలు ఉన్నట్లు తేలడంతో.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి.
ఒకవిధంగా శిరీషను 'వ్యభిచారిణి'గా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందన వాదన వినిపిస్తోంది. అటు శిరీష సైతం ఇదే ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కుకునూర్ పల్లికి చేరుకోవడం కన్నా ముందే శ్రవణ్.. శిరీష ఫోటోను ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి వాట్సాప్ ద్వారా పంపించడం.. అంతకుముందు ఆమె అందం గురించి ఫోన్ లో వివరించడం వంటివి చూస్తే.. శిరీషపై వారు ఎలాంటి ముద్ర వేయాలనుకున్నారో అర్థమవుతోంది.

వెయ్యి కాల్ రికార్డింగ్స్!:
పైగా గతంలో చాలాసార్లు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి శ్రవణ్ అమ్మాయిలను సరఫరా చేసిన చరిత్ర ఉంది. శ్రవణ్ మాటలతో శిరీష పట్ల ఆకర్షితుడైన ప్రభాకర్ రెడ్డి.. పలుమార్లు ఆమె గురించి ఫోన్ లో ఆరా తీసినట్లు చెబుతున్నారు. ఇక కేసులో ఏ-2గా ఉన్న రాజీవ్ ఫోన్ లో వెయ్యికి పైగా ఫోన్ రికార్డింగ్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

శ్రవణ్ మొబైల్ లో అసభ్య చిత్రాలు:
అటు శ్రవణ్ మొబైల్ లోను పలు అసభ్యకర చిత్రాలను పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. వీటిని బట్టి చూస్తే.. శిరీషను వారు ఉద్దేశపూర్వకంగానే ఏమార్చారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆత్మహత్యపై అనుమానాలు:
తేజస్విని విషయమై.. రాజీవ్‌తో గొడవ వ్యవహారమే శిరీషకు ఈ దుస్థితిని కల్పించినట్లు తెలుస్తున్నా.. ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్న సంగతి తెలిసిందే. అటు రాజీవ్ తో ఫోన్ టేపుల్లోను శిరీష సంభాషణ ఎక్కడా భయపడుతున్నట్లుగా లేదు.

తెరపైకి కొత్త పేర్లు:
తేజస్వినిని తన జోలికి రాకుండా చూడాల్సిందిగా రాజీవ్ ఫ్రెండ్స్ నవీన్, నందులకు శిరీష ఒకవిధమైన హెచ్చరిక లాంటిది కూడా చేసింది. దీంతో శిరీష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదన్న వాదనకు మరింత బలం చేకూరుతోంది. మొత్తం మీద ఏ కారణాల చేత శిరీషను బలిపశువును చేశారన్నది ఇంకా తేలాల్సి ఉన్నది.












Click it and Unblock the Notifications