సాగర్ చూసేందుకొస్తే ప్రపంచ బ్యాంక్ బృందంపై తేనెటీగల దాడి, జూ.ఆర్టిస్ట్‌కు డ్రైవర్ వేధింపు
హైదరాబాద్: నాగార్జున సాగర్ సందర్శనకు వచ్చిన ప్రపంచ బ్యాంక్ బృందం సభ్యుల పైన తేనెటీగలు దాడి చేశాయి. దీంతో, వారు నాగార్జున సాగర్ జలాశయాన్ని చూడకుండానే వెనుదిరగవలసి వచ్చింది. ఈ సంఘటన శుక్రవారం నాడు ఉదయం జరిగింది.

ఢిల్లీలో సైబరాబాద్ పోలీసుల తనిఖీలు
దేశ రాజధాని న్యూఢిల్లీలో సైబరాబాద్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నైజీరియన్‌ను పోలీసులు విచారిస్తున్నారు. నైజీరియన్ నివాసంలో 10 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
దీంతో, భారీగా మాదక ద్రవ్యాలు కలిగి ఉన్న నైజీరియన్ ముఠాను ఢిల్లీలో సైబరాబాద్ క్రైం పోలీసులు పట్టుకున్నారు. నైజీరియన్లు నివసిస్తున్న ఇంటిపై గురువారం రాత్రి దాడులు చేశారు. ఈ దాడిలో పోలీసులు 8కిలోలకు పైగా మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు.
మొత్తం 13మంది సభ్యులున్న ఈ ముఠా ఆన్‌లైన్ మోసాలకు కూడా పాల్పడుతోంది. ఇటీవల సైబరాబాద్‌లో ఓ మహిళను వివాహం చేసుకుంటానని నమ్మించిన ముఠా సభ్యుడు ఆమె నుంచి భారీగా డబ్బులు దండుకుని మోసం చేశాడు.
ఈ ముఠాను పట్టుకునేందుకు పోలీసులు వెళ్లిన సమయంలో వారి నివాసంలో సోదాలు చేపట్టగా మాదక ద్రవ్యాలు లభ్యమయ్యాయి. 10 మంది నైజీరియన్లతో పాటు ముగ్గురు మహిళలను ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. వీరందరినీ పీటీ వారెంట్‌పై హైదరాబాద్ తీసుకురానున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం పాల్వాయి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారు - ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
శుక్రవారం తెల్లవారుజామున నార్కెట్‌పల్లి కామినేని ఆస్పత్రి వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మొన్న ఇంద్రపాలనగరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
జూనియర్ ఆర్టిస్ట్‌కు వేధింపులు
హైదరాబాదులోని వనస్థలిపురంలో ఓ జూనియర్ ఆర్టిస్టును లైంగికంగా వేధించిన ఆర్టీసీ డ్రైవరును పోలీసులు అరెస్టు చేశారు. జూనియర్ ఆర్టిస్ట్ ఫిర్యాదు మేరకు వనస్థలిపురం పోలీసులు కేసును దర్యాఫ్తు చేస్తున్నారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications