షాకింగ్: 'బ్లాక్ మనీని తెల్లగా మార్చుకునేందుకే మోడీ నోట్ల రద్దుపై కేసీఆర్ మౌనం'

హైదరాబాద్: రూ.500, రూ.1000 నోట్ల రద్దు పైన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ గురువారం నాడు ప్రశ్నించారు. ప్రధాని మోడీ నిర్ణయంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పారు.

 Behind KCR silence on Modi notes ban!

నోట్ల రద్దు కారణంగా రాష్ట్రంలో అనేకమంది చనిపోతున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. నోట్ల రద్దు వల్ల కనీసం దహన సంస్కారాలు చేసుకునే పరిస్థితి కూడా లేదన్నారు. బ్లాక్ మనీని తెల్లగా మార్చుకునేందుకే కేసీఆర్ ప్రధాని మోడీ నిర్ణయంపై మాట్లాడటం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

నోట్ల రద్దు మంచిదే కానీ

కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మంచిదే కానీ, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేంద్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా నోట్లు రద్దు చేయడం వల్ల ప్రజలకు తీవ్ర అవస్థలు ఎదురౌతున్నాయన్నారు. రోజుల తరబడి బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+