Durgam Chinnaiah: వీడియో విడుదల చేసిన దుర్గం చిన్నయ్య.. అందులో ఏముందంటే..!
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఓ యువతి తీవ్ర ఆరోపణలు చేసింది. దుర్గం చిన్నయ్య తమను నమ్మించి మోసం చేశాడని చెప్పింది. తమ వద్ద డబ్బు తీసుకుని జైలు పంపించాడని ఆరోపించింది. ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని ఒక వీడియోను కూడా విడుదల చేసింది. డెయిరీ ఏర్పాటు గురుంచి ఎమ్మెల్యే వద్దకు వెళ్తే తమ వాళ్లకు వాటా అడిగాడని వీడియోలో యువతి పేర్కొంది. ఆ తర్వాత తమ కంపెనీలో పనిచేసే అమ్మాయిని పంపాలని ఒత్తిడి తెచ్చాడని ఆరోపించింది. ఒత్తిడి భరించలేక బ్రోకర్ నెంబర్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చింది. తనను మద్యం తాగాలని బలవంతం చేశాడని సదరు యువతి ఆరోపించింది.
యువతి ఆరోపణలపై ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పందించారు. ఆయన ప్రెస్ మీట్ పెడతారని భావించారు. కానీ చిన్నయ వీడియో విడుదల చేశారు. తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. తానంటే గిట్టనివారు ప్రతిపక్షాలతో కలిసి తనపై కుట్ర చేస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియా, వాట్సాప్ లో ప్రచారం అవుతున్న ఫోన్ నెంబర్, వాట్సాప్ చాట్ తనది కాదన్నారు.

కొందరు రైతులకు ఉచిత ఫాంలు, లోన్లు ఇస్తామని తన వద్ద వచ్చినట్లు చిన్నయ్య చెప్పారు. అది నమ్మి వారికి మద్దతుగా ఉన్నానని కానీ వారు తనకు తెలియకుండా రైతుల వద్ద డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. దాదాపు 20 నుంచి 25 మంది రైతుల వద్ద రూ.60 నుంచి70 వసూలు చేసినట్లు చిన్నయ్య తెలిపారు. ఈ విషయాన్ని రైతులు తన దృష్టికి తెచ్చారని అందుకే పోలీసులకు చెప్పానని పేర్కొన్నారు.

అందుకే తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అన్నారు. సోషల్ మీడియాలో తనపై దుష్పప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో కావాలనే ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. దీన్ని న్యాయపరంగా ఎదుర్కోంటానని చెప్పారు.












Click it and Unblock the Notifications